మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం

శ్రీ కృష్ణుడు -యాదవుల పూర్వవృత్తాంతము


యాదవుల పూర్వవృత్తాంతము.

                                            నహుషుఁడు సరులలో జన్మించినను తన నిరుపమాన సత్ప్రవర్తనమువలన మహాఋషులను మెప్పించి దేవేంద్రపదవి పొందెను. అతని మనుమడైన యదుతనతండ్రియా యయాతి యీప్సితంబు నీడేర్పకుండుటచే రాజ్యభ్రష్టుఁడయ్యెను. యదు వంశీయులగు వృష్టి భోజ మల్ల కుకుర అంధకులు కలకాలము ఆర్యావర్థ పరిసర భూములంద్రిమ్మరి శంతనుచక్రవర్తి యనంతర మార్యావర్తమున విజృంభించి చిన్న చిన్న రాజ్యముల నేర్పఱచు కొనిరి. వారిలో మాధవుఁడను భోజకుఁడు యమునానదీతీరమం దున్న మధురానగరమాక్రమించి ఆ ప్రాంతములకు రాజయ్యెను. ఈతనిసోదరులగు ముచికుందాదులు వింధ్య, సహ్యాద్రి, మాల్య వంతము మొదలగు దక్షిణాపధ దుర్గమపర్వత రాజంబులందు దుర్గంబుల నిర్మించి అట దుర్జయులైరి. నర అసుర యదు పురు వంశీయులు ఉభయులును జాతుల సంకరమువలన కలిగినట్లు యయాతి మహారాజుచరిత్రమే చెప్పుచున్నది. వానిభార్యలలో దేవయాని దైత్యగురువగు శుక్రునికుమార్తెయనియును, శర్మిష్ఠ వృషపర్వుండను అసుర రాజు కూతురనియు చెప్పబడియున్నది. యాదవులు యదువంశీయులు; యవనులు తుర్వసు సంతతి వారు; భోజకులు దృహునకు పుట్టిరి. అణువువలన మ్లేచ్ఛులు కలిగిరి. తండ్రికి తన పుంసత్వము యిచ్చిన పురు వంశీయులే పౌరవ్యులు. ధృతరాష్ట్రుఁడు, పాండురాజు అనువారు పౌర వ్యులలోనివారు. ఋగ్వేదమునందు యదు, తుర్వసు లిద్దరును దశ్యులైనట్లును, అనేకగోవుల నిచ్చి సమారాధనల నెరపి మనువును మంచిమాటలాడుటచే వారి నాతఁ డార్య సంఘములో చేర్చుకొనినట్లును, చెప్పబడియున్నది. కావున వీరల సంతతివా రగు యదు, వృష్టి, భోజ, అంధక, కుకుర, ముద్ర, కరూశ జాతుల వారందరు ఆర్యావర్తపుణ్యభూమి కావలనుండిన ద్రవిడజాతులవా రనియును, వీరు కొంతకాలము అసురవీరుల పాలన మందుండి తరువాత ఆర్యసంఘమందు ప్రవేశించి శ్రీకృష్ణునినాడు ఆర్యులలో ఐక్యమైనట్లును స్పష్టపడగలదు. భారతమునుబట్టి యయాతి వంశీయులైన యాదవ‘ జాతులకు రాజ్యపాలనాధికారము లేదు. య, వృష్టి భోజక, కుకుర, మల్ల మొదలగు తెగలవారందరుసు యదువంశీ యులే. వీరందరు తొలుగొల్త ఆర్యావర్తమునకు పశ్చిమమున నుండిన దేశములలో సంచరించుచుండిరి. కాలక్రమమున ఆర్యావర్త భూములయందు ప్రవేశించి సింధునదీప్రాంత భూము. లందును, దక్షణ హిందూదేశమందును, నివసింప మొదలిడిరి. అందు భోజకులు యమునాతీరమందు మధురానగరము రాజధానిగా నొక రాజ్య మేర్పఱచుకొనిరి. సార్వభౌమపదము తొలగియుండిన యాదవులలో భోజకులకే తొలుదొల్త రాజ్య పాలనాధికారము కలిగెను.యాదవుల పాలనకు లోబడిన అనార్యజాతి ఆభీరులు. వీరు శూద్రులుగను, యాదవులు క్షత్రియులుగను, ఆర్యులచే అంగీకరింపబడిరి. ఈయాదవులలో వృష్టి వంశీయులు కొంతకాలమైనతరువాత అధిక బలవంతు లైరి. భోజకుల యింటి ఆడపడుచును పౌరవ్యులు సహితము వివాహ మాడి వారితో మైత్రి కావించుకొనిరి. కుంతిభోజుని కుమా రై యగు కుంతీ దేవిని పౌరవ్యుఁడగు పాండురాజు పెండ్లాడు బీ యిందుకు నిదర్శనము కాదా ! వసు దేవుని కాలమున వృష్టి వంశీయులు ఆర్యావర్తమం దధికబలవంతులుగ నుండుటచే నానా దేశపు క్షత్రియకుటుంబములాతనికి తమతమకన్యల నిచ్చి వసుదేవుని మైత్రి నభిలషించుచుండిరి. ఆహుకుని ఏద్గురు కొమార్తెలను ఆహుకుని తమ్ముఁడగు ఉగ్రసేనుఁడు వసుదేవున కిచ్చి వివాహము గావించెను. అందు రోహిణియొకర్తుక. కోసల రాజు కస్యల నిరువురను, కాశీపతికూతురగు వైశాఖిని, వివాహ మాడెను, సృగాళుఁడు వసుదేవుని మైత్రినాసించి తనకన్యయగు నునామ్ని నాతనికి భార్యగ నొసంగెను. ఇంత యేల: యాదవ వంశీయులలో మకుటధారులమని విఱ్ఱవీగుతున్న మధురాధి నాధులగు భోజకులు సహితము తమకన్యల, దేవకి మొదలగు ఏడ్గురను వసుదేవునకర్పించి అతనిసఖ్య మపేక్షించి యుండిరి. వసుదేవుఁడు మధుర కేతెంచునప్పుడు యువ రాజగు కంసుఁడు స్వయముగ రధమునడపి ఆతనిని గౌరవించెను. మధు రాధిపతి యగు ఉగ్రసేనుఁడు వసుదేవుని మైత్రివడసి యుండుట చేత నే జరాసంధునిపతుము చేర నిరాకరింప సాహసించెను. ఇంక ఆర్యావర్తమున పౌరవ్యుల అధికార మెటులుండెనో చూతము. శంతను చక్రపర్తి కాలమునాటివఱకు పౌరవ్యుల అధి కారము ఆర్యావర్తమున నిరంకుశమైయుండెను. విచిత్రవీర్య చిత్రాంగదుల శైశవంబున పౌరవ్య సామ్రాజ్యంబునంగల సామం తులు స్వతంత్రింప మొదలిడిరి. మగధాధీశుఁడైన బృహ దధుఁడు పౌంవ్యు") అధికారము ధిక్కరించి స్వతంత్రించెను. ఆతఁడు తన స్వతంత్రతను స్థిరపరచుకొన నెంచి ప్రార్దాక్షిణ వాసులగు జాతులతో మైత్రిగావించుకొనెను. మగధ రాజ్య మునకు ప్రాక్ దక్షిణభాగంబులను బలిక్షేత్ర మందురు. అసుర అధికారము ప్రబలముగ నుండుటచే ఆతఁడు ఆ మార్గములు సనుసరింపలసివచ్చెను. ఉత్తర పశ్చిమభాగమం వంశీయుల దుండిన పాంచాలుకుకూడ స్వతంత్రించి సమ్రాట్టులగుటకు నువ్విళులూరుచుండిరి. పౌరవ్యసామ్రాజ్య వ్యవహారముల చూచుచు నడిపించు చుండిన భీష్ముఁడు సామ్రాజ్యాభిమానము గోరి బాలుఁడగు ధృత రాష్ట్రునకు గాంధార రాజకన్యను, పాండునకు ఆనాడు ఆర్యావర్తమందు బలవంతులుగ నున్న యదువంశ సంజాతయగు కుంతీదేవిని, మద్రపతి కూతురౌ మాద్రినింగూడ భార్యలుగ నొనర్చెను. పాండు రాజు వయోవంతుఁడై రాజ్య భారము వహించిన తరువాత దిగ్విజయ మొనర్చి పౌరవ్యుల అధికారమును ఆర్యావర్తముదు అన్ని యెడల వ్యాపింప జే సెను. కాని పాండురాజు శాపదగ్ధుఁడై అకాలమృత్యువు వాతఁ బడుటచే జాత్యంధుండగు ధృతరాష్ట్రుఁడు సామ్రాజ్యవ్యవహార ములఁ జూడవలసి వచ్చెను. అప్పట్టున పౌరవ్యసామ్రాజ్య మందు మఱల అరాజకము తలచూప మొదలిడెను, పాంచాల పతి యగు ద్రుపదుఁడు స్వతంత్రించి ఆర్యావర్త సమ్రా ట్టగుటకు వేచియుండెను. మఱియు పాంచాలురు నిరంకుశులుగ నుండుటచే పొగ రెక్కి త దేశ వాసులుగను, మిత్రులుగను నుండిన బ్రాహ్మణోత్తముల నగౌరవించుటచే ద్రోణ ప్రభృతులు ద్రపదుని వీడి వచ్చిరి. భీష్ముఁడు ద్రోణాదుల బలపౌరుషంబులు గుర్తెఱింగి వారినిసత్కరించి కురురాటుమారులకు యొజ్జలుగ నియోగించెను. ద్రోణాదులు పౌరవ్యుల అస్త్రవిద్యాపారం గతులుగ నొనర్చి వారిమూలమున పాంచాలపతిని పరిభవింపఁ జేసెను. నాటినుండియు ద్రుపదునకు పాండుసుతులపై ప్రేమయు గౌరవమును అధికమయ్యెను. పౌరవ్యు లనుభవించుచుండిన ఆర్యావర్త సార్వభౌమతను నాల్గుమూలలనుండిన నాలుగు ముఖ్య జాతుల వా రాసించుచుండిరి.
1. మగధాధీశుఁడైన జరాసంధుఁడు. 2. పాంచాలపతియైన ద్రుపదుఁడు,
3. మత్స్య దేశాధీశుండగు విరటుఁడు.— (ఈతనికి సింహబలుఁడు బాసటయై యుండెను.)
4. మధుర నేలుచుండిన ఉగ్రసేనుఁడు — (వృష్టి వీరుఁడగు వసు దేవుఁడు తనకు వెనుదండిగా నుండునని ఉగ్ర నేనుఁడు తలంచియుండును.)
మొదట ఆర్యావర్తము నాల్గు ముఖ్యభాగములుగ విభజింపబడియుండెను:-
(1) సప్తసింధు అను పేరున సింధునది ముఖ్యముగ పారుచుండు దేశము పిలువబడుచుండెను.
(2) పంచనదము అను పేరున సింధునది యొక్క ఉప శాఖలు ప్రవహించుచుండు దేశము. (3) సరస్వతి పద్వతీ నదుల మధ్య దేశమునకు బ్రహ్మావర్తమని పేరు. ఇందుండిన ఆర్యులు చుట్టు ప్రక్కలనున్న దేశముల నాక్రమించి అభివృద్ధి గాంచిన తరువాత ఆ దేశమంతయు మధ్యదేశ మని పేరొందెను.
(4) గంగానదికి దిగువనున్న మధ్య భాగము ముఖద్వార ప్రాంత భూములు ప్రాచీ (Praki) దేశమని పిలువ బడుచుండెను. గోగ్రా, గండకి, సోణభద్ర (హిరణ్య భాగ) నదులు ప్రాచీ దేశమందుండెను. గంగానది దక్షిణతీరమునుండి గోదావరీనదివఱకునున్న భూ భాగము · అరణ్యమయమై 'దండక' అనునామమున పిలువబడుచుండెను.
కౌరవులును, పాండవులును నివసించిన దేశము కురు దేశము ముఖ్యనగరము హస్తినాపురము. పాండవులు యమునానది నగరము నిర్మించుకొని పశ్చిమమున కేగి అచ్చో * ఇంద్రప్రస్థ నగ నివసించుచుండిరి. కురురాజ్యమునకు తూర్పున పాంచాల ముండెను, అందు అహిఛత్రము, కన్నా గము, కోనించి ముఖ్యనగరములుండెను. గంగా యమునకు పై మధ్యం గంగకు కొంత పఱకు తూర్పునను
(1) మత్స్య, శూరసేన దేశములు మధ్య దేశమున భాగములం దుండెను.
(1) పారా మాగధులు మధ్య దేశమునుండి
గంగానదీద దక్షిణ పశ్చిమ భాగమున కేతెంచిరి. మహాభారతకాలమున అంగ, వంగ, పుండ్ర, కిరాట దేశములును, మత్స్య దేశమునందలి భాగమైన చేది దేశముకూడ మాగధులకు సామంతులుగ నుండిరి. పాంచాలమునకు తూర్పున కోసల, అద్దానికి తూర్పున విదేహ దేశములు, గంగానది కుత్తరభాగమందుండెను. విదేహ దేశ మునకు తూర్పున ప్రాగ్జోతిషము, ఆపైన కామరూపమునున్నవి. కోసలులు కొందఱు వింధ్యపర్వత దక్షిణభూముల కేతెంచి, అచ్చో నొక రాజ్య మేర్పఱచుకొనిరి. అయ్యదియే దక్షిణ కోసల, పూర్వసముద్రతీరమునకు కళింగమని పేరు. పశ్చిమ తీరము ప్రభాసమని పిలువబడుచుండెను. పశ్చిమ ప్రాంతము లందు ద్వారకానగరమున శ్రీకృష్ణుఁడను బలవంతుఁడ గు నాయకుఁడుండెను. సింధుదేశము మనముగ కి రావని పర్వత పంక్తు లకును మధ్య సాళ్వ దేశముండెను. అనార్యులుగ నుండిన యాదవులు తమ సత్ప్రవర్తనము వలన ఆర్యులలో చేరినట్లును, కాలక్రమమున వారు తమ బలమధికము కావించుకొని స్వతంత్ర రాజ్యములు నేర్పఱచు కొనినట్లును, వసు దేవునినాడు యదువంశీయుల బలము అత్యధికమగుటచే ఆర్యావర్తమం దనేక రాజకుటుంబముల వారు యాదవులతో సంబంధ బాంధవ్యములుకూడ చేయ మొద లిడినట్లు కాన్పించును. యాదవుల అభివృద్ధికి జరాసంధుఁడే ప్రబలవిరోధిగ నుండెను. అదిగాక పూర్వరాజవంశ మైన పౌరవ్యుల బలము నానాటికిని సన్న గిలుచుండుటచే పాంచాల, మత్స్య, మాగధులు వారిని ధిక్కరింప ప్రారంభించుచుండిరి . వసుదేవుని కుమారుఁడగు శ్రీకృష్ణుఁడు యాదవు లభివృద్ధి జెందు టకు మత్స్య, పాంచాల, మాగధులను తొలుదొల్తఁ బౌరవ్యు లకు లోబరుపవ లెనని సంకల్పించుకొనెను. కావున పౌరవ్యులలో నొకశాఖయగు పాండవులకు పాంచాలురతోడను, మత్స్య దేశాధిపుఁడగు విరటునితోడను, బాంధవ్యము సంఘటిలుట శ్రీకృష్ణునకు ఆమోదదాయకమయ్యెను. శ్రీకృష్ణుఁడు యెదుట నిలిచి భీమునిచే జరాసంధుని చంపించి పాండవులను ఆర్యావర్త వున అధిక బలవంతులఁజేసెను. భారతవర్షమున ఆనాడు జరిగిన మహాయుద్ధమందు యాదవులే రధికులై కార్యమూనినచో, ఆర్యనృపులెల్ల రలిగి, ఏకీభవించి యాదవుల రూపుమాపుదురన్న భీతి శ్రీకృష్ణున కుండుటచేత నేకావలయు పాండవులను ముందుంచి కురుక్షేత్ర రణరంగమున దా బ్రవేశించెను. కురుక్షేత్రయుద్ధానంతరము నిర్జీవమైన భారతవర్షమును పాండవులెంతో కాల మేలరని యును, అందుచే యాదవులు అనాయాసముగ ఆర్యావర్త మున నిరంకుశాధికారులు కావచ్చుననియును కృష్ణుడు తలంచి యుండవచ్చునేమో ! కాని, యాదవవీరుల అవివేకకృత్యము లే వారివినాశమునకు కారణములయ్యెను. యాదవులు నవనాగరికు లయందు తాండవించుచున్న ముఖ్యమైన *మూడు దురభ్యాస ములును, అలవరచికొని యుండిరి. వారు నిరంతరము యుద్ధములయందును, వనితావినోదములయందును, సురాపానమందును, వృధ సేయుచుండిరి. తుదకు కల్లు త్రాగి కైపెక్కి యాదవు లొకరి నొకరు గ్రుద్దుకొని చచ్చిరి. తమకాలమును పెరటి చెట్టు మందునకు పనికిరా దనునట్లు శ్రీకృష్ణుని బోధనలు సూదవులకు పథ్యముకాకుండెను. అందు చేత నే ఆకఁడు తనయందు భ క్తివిశ్వాసములుంచిన పాండవుల అభి వృద్ధికే పాటుపడెను. యాదవులయందు దురభిప్రాయము జనించుట చేతనే తనమూలబలమగు నారాయణగోపాలురను కూడ కురుక్షేత్రయుద్ధమందు శ్రీకృష్ణుఁడు శ్రీకృష్ణుఁడు రణదేవతకు బలియిచ్చెను. నుండిరి. ఉగ్రసేనుఁడేలిన మధురానగరము మొదట మాధవుఁ డనువాఁడు నెలకొల్పి వివిధ శాఖల యాదవుల కయ్యది పట్టు కొమ్మగాఁ జేసెను. మాధవుని వంశీయులైన భోజకులు రాజు లైరి. వృష్టి యిత్యాది శాఖలవారు వారికి అనుచరులుగ ఈభోజకులలోనివారు కొందరు వింధ్యపర్వత ప్రాంతముల కేగి విదర్భకడ వేరొక రాజ్య మేర్పఱచుకొనిరి. కాల క్రమమున మధురానగరము యాదవవీరులకు ముఖ్యస్థానమై వన్నె కెక్కుటయేగాక పాంచాలురకును, పౌరవ్యులకునుగూడ పక్కలోని బల్లె మట్లుండెను.

వసు దే వుఁ డు
( ఆనకదుందుభి )

మధురయందును దక్షిణాపథ భూములయందును యదు వంశీయులు చిన్న చిన్న రాజ్యముల నెలకొల్పుకొని అభివృద్ధి జెందుచుండిరి. ఆర్యావ ర్తప్రాంతభూములందు నివసించిన జాతులయందు పాలిత పాలక భేదములు మాత్రముండెను. వీరిలో పాలకులకు యాదవు లనియును, పాలితులకు అభీరులనియు పేరులు. అందుచేతనే యాదవులు క్షత్రియులుగను, అభీరులు శూద్రులుగను, ఆర్యులు గణించుచుండి". కొంత కాలమైన తరువాత ఈ యదువంశీయుక్షత్రియులలో అనేకశాఖ లుద్భ విల్లెను. వారందరకును భోజకులు నాయకులుగ నుండిరి. కావున తొలుదొల్త 'భోజవంశమువారు రాజులై చరియింప ఇతర సూదవులుకింకరు లై చరియించుచుండిరి. ' అందువృష్ట్ని వంశము న వసుదేవుఁడనువాఁడుజన్మించి అధిక బలవంతుఁడుగ నుండుటను మధురపతియైన ఉగ్రసేనుఁడు కీర్తి శేషుఁడును తనయన్న యును నగు ఆహుకునికూతునిచ్చి చెంతనుంచుకొనెను. వసుదేవుఁడు ఆర్యావర్తమందుండిన అనేక దేశముల రాజకన్యకల వివాహ మాడి వారితో యాదవులకు సఖ్యము చేకూర్చెను.
అసురసంప్రదాయానువ ర్తియగు జరాసంధుఁడు మధుర నేలుచుండిన భోజకులను తన పంతమునకు డ్రిప్పుకొన నెంచి ఉగ్రసేనుని కుమారుఁడగు కంసునకు తనకూతులనిచ్చి వివా హము కావిం చెను. కాని చార్వాకమత మవలంబించిన వారభివృద్ధిగాంచలే రని వసుదేవుఁడు బాగుగ గుర్తెఱింగి యుం డుటచే, జరాసంధకూటమున ఉగ్రసేనుని జేరకుండ జే సెను. నీకో, అంతట జరాసంధుఁడు తనఅల్లుఁడగు కంసుని జేరదీసి కానిమాటలాతనికి చెప్పెను. “వసుదేవుఁ డార్యావర్తమున అధిక ప్రఖ్యాతి నార్జించుచున్నాడు. మీ తండ్రి ఆతని చేతిలోని కీలుబొమ్మ. నేడో రేపో వసుదేవుఁడు మీ తండ్రిని త్రోసి మధుర సింహాసన మాక్రమింపనున్నాడు. వసుదేవునిచేతమో తండ్రికో, కాకున్న వసుదేవునికి పుట్టనున్న కొమరునిచేత మృత్యువునిశ్చయము - చేతులు కాలిన తరువాత ఆకులుపట్టిన లాభముండదు. కార్యము మీరకుండగనే కనులువిప్పుము వసుదేవుఁడు పుత్రవంతుఁడై నంత నే అతనికిలోభము హెచ్చును. రాజ్యతృష్ణ జనించును. వసుదేవుఁ డేకాకిగ నున్నంత కాలము ఆతఁడు విభోజకులను వినయవిధేయతలతో సేవింపవచ్చును.” జరాసంధుని మాటలు కంసునిమనంబు కలంచెను. అం దుచే నాతఁడు వసుదేవుని దేవకీ సమేతముగ కారాగృహబద్ధు నొనర్చెను. వసుదేవుఁ డధిక బలవంతుఁడయ్యును యాదవుల నేమముగోరి చెరయందుండుటకు సమ్మతించెను. అంతియే కాదు; కంసునిభీతి బాపవసు దేవుఁడు తనకు దేవకియందుజన్మించు సంతానముకూడ కంసుఁడుఖండించుటకు తాను సమ్మతించెను. క॥ పలికిన పలుకులు దిరుగక, సొలయక వంచనములేక సుతులు పులకుం గలఁగక యిచ్చిన ధీరుం డిల వసుదేవుండు దక్క నితరుఁడు గలడే ॥
తదుపరి జరాసంధుఁడు తనయనుచరులగు రక్కసులు కంసుకడకంపి ఆతని దనుజమార్గానువర్తిఁగమార్చ మొదలిడెను. బాణ, భౌమ, మాగధ, మహాశన, కేశి, ధేనుక, బక, ప్రలంబ, తృణావర్త, చాణూర, ముష్టి కారిష్ట, ద్వివిధ, పూత నాది రక్కసులు మధుర కేతెంచుటచే, అనేకమంది యాదవులు, తమతమపదవుల విడిచి నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశంబులు సొచ్చిరి. మచ్చరంబులు రె విడిచి కొందఱు మాత్రము కంసుని కొలిచియుండిరి. అందుచే యాదవబలంబు నానాటికి సన్నగిలఁ జొచ్చెను. మాటదప్పక కన్నపుత్రులఁజంప కంసున కప్పగింపుచుండి నను, ఆతఁడు తనక్రూరమార్గంబుల వీడకుండుటచే వసుదేవుఁడు కంసుని మోసగించి అంత మొందించిన గాని, యాదవులకు సేమంబుఁ జేకూరదని నిశ్చయించి, దేవకి ఏడవచూలగు బలరా ముని కంసునకీయక, దేవకిగర్భంబు విచ్ఛిన్నమైనదని బొం కెను. ఆబాలుని పెంప నాభీరనాయకుఁడగు నందునికడ కంపెను. తరు వాత జన్మించిన బాలునికూడ నందునికడకు తానుస్వయముగ గొనిపోయి, ఆటనుండి ఒక స్త్రీ శిశువును కొనివచ్చి యియ్యదియే దేవకి ఎనిమిదవ కాన్పని కంసునితో చెప్పెను. కంసుఁడా స్త్రీశిశు వునే పట్టివధించెను.
ఈ దేవకి ఎనిమిదవచూలే మనకధానాయకుఁడగు శ్రీకృ ష్ణుఁడు. జరాసంధుని దుర్మత్రంబున కంసుఁడు దేవకీవసు దేవుల కారాగృహమందుంచినంతమాత్రమున యదువంశ మంతరింప లేదు. వసుదేవుని సంకల్పము కడుదొడ్డది. ఆ కారాగృహమే జరాసంధాది దుష్టనృపుల మారణ మొనర్పజాలిన మహావీరు లుద్భవించుటకు కావలసిన వాతావరణ మొనగూర్చెను. ద్రోణునిచే పరాభవింపబడిన ద్రుపదుఁడు ఈసువీడి, ధృష్టద్యు మ్నుని బడసినటుల, ఆసురమాగ్దానువర్తులగు రాజుల కుతంత్ర ములచే చెరయందుండిన వసుదేవుఁడు ప్రార్థించి ప్రార్థించి అసుర సంహరణమునకు చాలిన యదుకిశోరమును శ్రీకృష్ణుని గావించెను. అట్లగుట నెకదా తలిదండ్రుల పూజాఫలమే కొమరు లై పుట్టుదు రందురు. కంసుభీతిచే కృష్ణుఁడు కలకాలము అభిరశిబిరంబులనుఁడ వలసివచ్చెను. అందుచే అభీరులకు ఈతనియెడ అభిమానము మెండయ్యెను. చిన్న నాటనుండియు శ్రీకృష్ణుఁడు అభీరుల మధ్య నా రాతనికొఱకు ప్రాణములగూడ నాడుకొనుచుండుటచే సర్పింప సంసిద్ధులైయుండిరి. శ్రీకృష్ణుని అభివృద్ధికి అభీరులే మొదట నధికముగ తోడ్పడిరి.

శ్రీకృష్ణుని జననము-బాల్యము

అసురప్రేరితుఁడై కంసుఁడు ప్రజల ననేకవిధముల బాధించుచుండెను. కొంతకాలమునకు తన సోదరికి జన్మించిన బాలుఁడు సజీవుఁడైయున్నటులఁ దనకు వినవచ్చెను. అంత నా దురాత్ముఁ డాబాలువలన నాపాయము శంకించి మంత్రులతో మంతనము చేయ వా రిట్లనిరి.
కం. “ఇట్టయినఁ దడయ నేటికిఁ,
బట్టణముల మందలందుఁ బల్లెల జిల్లన్
బుట్టెడు పెరిగెఁడు శిశువులఁ
బట్టి వధించెదము మమ్ముఁ బంపు మధీశా.”
వారిపలుకులకుఁ జెవియొగ్గి కంసుఁడు పూతనాది రాకు సుల బృందావనమున కంపెను. అపకారమును జేయ లేకుండిరి. కాని వారు కృష్ణున కెట్టి ఆ.“ వెదకి వెదకి దైత్యవీరులు సాధుల
నడఁప వారిబలము డెఁగిపోయె;
యశము ఓరియు ధర్మ మాయువు భద్రంబు
లార్యహింససేయ నడఁగుఁ గాదె.””
రాక్షసమార్గంబుల నవలంబించిన రాజుల ప్రతిభ యిట్టులే సన్న గిల్లును. బలరామకృష్ణు లెట్టివీరులు కానుండి అది వారి బాల్యక్రీడలం దే కాన్పింపఁదొడఁగెను.
సీ. "గోవల్లభుఁడ నేను గోవులు మీరని, వడి అంకెపైచుచు వంగియాడు రాజు నే భటులు మీరలు రెండు రం డలి ప్రాభవంబునఁ బెక్కు పనులఁ బనుచు నేఁనస్కగుండ మీరింటివా రని నిద్రపుచ్చి సొమ్ములు గొనిపోయి డాఁగు సూత్రధారి మీరంచఱు బహురూపు లని చెలంగుచు నాటలాడఁ బెట్టు
బాలక్రీడాకలాపములం దే మానవుని భవిష్యద్వర్తనము గోచరించును. వత్స ఒకరూపంబులు దాల్చి వచ్చిన అసురులు మర్మంబు లెరింగి కృష్ణుఁడు వారిని సంహరించెను. గోపగోపికా జనంబులు అంత:
కం. “ఆపదలమీఁద నాపద,
లీపాపనిఁ జెంది తొలఁగె నీయరకునిం
బైపడిన ఖలులు దహనునిఁ
జైపడు శలభముల పగిదిఁ బడిరి ధరిత్రిన్.”
అని యనుచు శ్రీకృష్ణుం గొని చూడిరి.
కం. “గోవర్ధముతో మనుజులు,
ద్రావుదు రీమడుఁగు నీరు చగ దిందుండన్
నీవును నీ బాంధవులును,
నీవనితలు సుతులు జనుఁడు నేఁ డంబుధికిన్
అంతట `కాళియుఁ డటనుండి కదలి రత్నాకరద్వీపంబు నకుం జని ఆటలాడుచు కృష్ణుం డొకనాఁడు యమునానది కవ్వలి వైపుననున్న మునులకడకు అన్న మడుగు గోపబాలురఁ బుత్తెం 'చెను. ఆమునులు గోపబాలుర మందస్థితింజూచి యన్నము లేదని పురుషులకన్న స్త్రీ లెక్కుడు దయారసము కలిగి యుందురని యెఱింగి కృష్ణుఁడు దనవారి నయ్యార్యుల భార్యల కడకుఁ బుత్తెంచెను. అంత నా ధరణీసురసుందరు లన్నంబు కడవల నిడికొనివచ్చి ఆఁకలిగొనియున్న ఆగోపాలుర కిడిరి. కం. “పర మేశ్వరార్పణంబు గఁ బ ర్త జనులకు బిక్షయిడినఁ బరమపదమునం బరఁ గదరు
అనాఁడు తమ స్త్రీలు అనుభవించుచుండిన పరమానందంబుఁ గాంచి బ్రాహ్మణు లిట్లు చింతింపఁ దొడఁగిరి :
కం. “జపహోమాధ్యయనంబులు ఁ,
దపములు వ్రతములును లేని తరుణులు హరి స
త్కృపఁబడసి రన్ని గలిగియుఁ
జపలతబొందితిమి భక్తిసలుపమి నకటా.”
కాని బ్రాహ్మణులు కంసభీతులయి బలకృష్ణ సందర్శనంబు సేయఁ జన రెరి.
ఒకనాఁడు ఇంద్రయాగంబు సేయం దలంచియున్న నం దాదులకడకు శ్రీకృష్ణుఁ డే తెంచి యిట్లనియె:-
కం. “కర్మమునఁ బుట్టు జంతువు,
కర్మమ్మున వృద్ధిబొందుఁ, గర్మమునఁ జెడుం,
గర్మమె జనులకు దేవతే,
కర్మమె సుఖదుఃఖములకుఁ గారణమధిపా ”
విప్రుండు వైదికకర్మంబున మెలంగు; నృపతి ధరణీపాలనంబున సంచరించు; నైశ్యుండు వాణిజ్య కృషి కుసీద గోరక్షణాదుల వర్తించు; శూద్రుం డగ్రజమ్ముల సేవించి బతుకు. సత్త్వరజ స్తమోగుణంబు లుత్పత్తి స్థితి లయకారణంబు లందు రజంబున జగంబుజన్మించు; ఇంద్రుఁ డేమి సేయఁ గలవాఁడని, ఇంక నిట్లనియె: సీ."పనులకుఁగొండకు బ్రాహ్మణోత్తములకు మఖము గావించుట మంచిబుద్ధ ఇంద్రయాగంబున కేమేమి చెప్పింతు రవియెల్లఁ జెప్పింపుఁ డరసి మీరు పాయసంబులు నపూపములు సైఁదపుఁ బిండివంటలు ఁ ఒప్పును వలయునట్టి ఫలశాకములు పండఁ బంపుఁడు హోమంబు సేయుఁడు ధేను దక్షిణల నిచ్చి గీ. బహురసాన్నంబు పెట్టుఁడు బ్రాహ్మణులకు
నచలులై పూజలొనరింపుఁ డచలమునకు
నసముండాల కునక సంహతికిఁదగిన భక్ష్యములఁ దెండు కడవుల పసులు కిండు.”
నరులకు సంరక్షకులుగనుండినంత కాలమే సురలు పూజార్హులు. అసురులు అనేక విధములగు బాధల నరులకుఁ గలిగించుచుండినను దేవేంద్రాదు లూరకుండిరి. అందుచేత శ్రీకృష్ణుఁడు వారిని పూజింపవలదని తండ్రిని వారించెను. ఇంతియేగాక సురలు దైత్యుల దుండగములకుఁ దోడ్పడుచున్నట్లు కాన్పించును. నందుఁడు యమునాజలంబులఁ గ్రుంకులిడు చుండ ఒక్క జైత్యుం డాతని వరుణనగరంబునకుఁ గొంపోయెను. అంతటఁ గృష్ణుఁడు వరుణనగరంబున కేగి తండ్రిని విడిపించి తెచ్చెను. నాఁటినుండియు వరుణుండు యాదవుల స్నేహం బపేషించుటకు మొదలిడెను. బలరాముఁడు వగణ దేవునితో మైత్రికావించి సుర చేయువిధంబు నేర్చుకొనెను, ఈసురాపానమే తుదకు యాదవుల వినాశనము నాకుఁ గారణమయ్యెను. ఇట్లు బల రామకృష్ణులు నానాఁటి కభివృద్ధిఁ జెందుచుండుట విని యాగంబుఁ జేయుమిషనుఁ గంసుండు రామకృష్ణులఁదనకడకు దోడ్కొనిరా ఇకూర్శునంపెను. అక్రూరుని వెంట రామ కృష్ణులు మధురానగరంబున కేతెంచిరి కాని, వా రాతనితో ఆరాత్రి పురంబుప్రవేశింప నిరాకరించిరి. కృష్ణుండానాఁటి రాత్రి నామూలాగ్రంబుగఁ బరిశోధించి, మరునాఁటి యుదయమున కోటకేగుచున్న నొక రజకునిగాంచి ఇట్లనియె:- మధురానగరంబంతయు “మామందలలోనఁ గట్టికొన మంచి పటంబు లేవు నీము కెన్ సుందరధాతిచేలములు శోభిలుచున్నవి తెమ్ము.” ఆమాటల శా రజకుండాగ్రహించి,
"మారాజుసొమ్ముఁ గైకొన నేరాజులు వెతు రింతయెవ్లివమే !
గొల్ల, యేగుము తలఁగన్.”
అనియెను. ఆచాకిపలుకులకుఁ గృష్ణుండు రోషించి ఘోరక రార్ద్రతలంజ వానితల పగులనడఁ చెను, కృష్ణునిదారుణకృత్యంబునకుఁబౌరు దిగులొంది రామకృష్ణులకుఁ గావలసిన వెల్ల నాలుక మెదపక యర్పించిరి. కుబ్జయను కురూపి కృష్ణునకు మేనఁబూసికొన సుగ లేపము లర్పించిన నాతండు సంతసించి, తత్పదంబులమీఁ దన పదంబులు ద్రొక్షి హస్తాంగుళద్వయమబల గవుద క్రిందవిష నిడి కృష్ణుఁడు విూఁదికి నెత్తిన ఆ మెవక్రత లెల్ల మానెను. అం మధు రానగరంబంతయు శ్రీకృష్ణుఁడు దుష్టశిక్షణార్ధము, శ్రీ సంరక్షణార్థమే తెంచిన మహాపురుషుఁడను పలుకులు వ్యా చెను. ధనుశ్శాలకరిగి అచ్చోనాతఁడు గురుతరమైనవిల్లువిర ఆకోదండభం నిర్గత ధ్వానము భోజవిభుని బింకము ఛేదించే తరువాత నాతఁడు కువలయాపీడ మను గజంబును వధిం చె కంసుం డపు డట కే తెంచి:
కం. “చచ్చిన కుంభీంధ్రంబును
వచ్చిన బలమాధవులను ఇరుసంగని, తా
నొచ్చిన చిత్త ముతోడుతఁ
జెచ్చెరఁ గడువెఱచె భోజసింహుం డధిపా.”
అంతటఁ గింసప్రేరితులై చాణూరముష్టికులను వీరులు శ్రీకృష్ణ బలరాములు మల్లయుద్ధంబునకు ఢీకొని మడిసిరి. భయకంపితుఁడై, ఆత్మవిశ్వాస మంతరింప మంత్రులం జూచి యిట్లనియె:
ఉ. “వల్లపబాలురన్ నగరివాకిటికిన వెడలంగ ద్రొల్బుఁ
గొల్లల ముట్టికోల్ గొనుఁడు శ్రూరుని నందుని గట్టుఁ డుర్వికిన్
దెల్లముగాఁగఁడు వసుదేవునిఁ జంపుడు; తండ్రిగాఁడు వీఁ
రుష్టుఁడు గావకుఁ డుగ్రసేనునిన్.
కంసునికి ఆత్మబలముపై విశ్వాసమంతరించుట గమనించి కృష్ణుఁ డాతనిపైకి సింహముక్త్రయన్ లంఘించి, పక్షీంద్రుం డురగంబుఁ బట్టువిధంబున కంసుని కేశబంధంబు లోక భంబు గఁబట్టి వానిని బడదొబ్బి చంపెను. కంసుఁడొనర్చిన పాపకృత్యములే యా తనిమనంబు వేధింప నందొక విధమగు భీతిజనించెను. కాకున్న వీరాధివీరుండగు కంసుఁడు బాలుఁడగు కృష్ణునిచే నిహతుఁడగుట ఎట్లుసంభవించును'? మనము చేయు పాపములే మహాభూతములై మనలను మ్రందించును.
శ్రీకృష్ణుఁడు కోటనుండి కదలి కారాగృహమున కేగి అందు గుందుచుండిన దేవకీవసుదేవులు విడిపించి, మాతా మహుండైన ఉగ్రసేనుందర్శించి:——
“అనకు యయాతిశాపమున యాడస వీరులకున్ నరేశ్వరా సవమున నుండిరాదు. ****రమ్ము జనపాలన శీలివిగమ్ము వేడ్కతోన్” అని వేడుకొనెను. వసుదేవుఁడైనను, అతనికుమారుండైనను గంసునిజంపి మధురా రాజ్య మాక్రమింతు రని జరాసంధుఁడు కల్పించిన అపవాదము మిధ్యయని యాదవలోకంబున కెరుక పరుషఁగావలయు శ్రీకృష్ణుఁడుముదుసలియైనఉగ్ర సేనున కేమరలఁ బట్టముగ ట్టెను, యాదనవీరులమనంబులందుజనించిన అనుమాన ములానాఁటితో నంత మొంచెను. నాఁటినుండియు వివిధ శాఖల యాదవు లేకమై అభివృద్ధిగాంచ మొదలిడిరి. “ఉగ్రసేనుని రాజు నేసినంతఁ దొల్లి కంపభీతులై విదే శంబుల కేగి కృశించుచున్న యదు వృష్టి భోజ మరు దశార్హ కుకుర అంధక ప్రముఖులు సకలజ్ఞాతిసంబంధులతో నే ఫ్రెంచి చిత్తంబులలర వారివారి నివాసంబులనుండ మొదలిడిరి.” ముందు కధావిధానంబునకు బలరామకృష్ణులు ఆర్య సాంప్రదాయముల నెఱుంగుట అశ్యవసరమని తలంచి, వసు దేవుం డాబాలురకు గర్గాది భూసురోత్తములచే నుపనయనము చేయించి, అవంతీపుర వాసియు, సకలవిద్యావిలాసియునైన సాందీపునికడకు నరువదినాలుగువిద్దెలు నేర్చుకొన వారల నంపెను. ఎదిగిన బాలురగుటచే వార లన్ని విద్యలను ఎక్కుడు శ్రద్ధతో నేర్చుకొన మొదలిడిరి. ఆవిద్యల ఆవశ్యకత గుర్తెఱింగి యుండుటచే అతిస్వల్పకాలమున వారు సకలకళాకోవిదు లైరి. మానవు లెవ్వరైనను గురువాక్యోద్యక్తులైనఁగాని తత్పూర్వా రంభము చేయబోలరు. కావుననే వసుదేవుండా బాలుర గురువు కడకంపెను. సాందీపనినంటి విద్యావిశారదుఁడు శ్రీకృష్ణునివంటి మేధావంతునికి ఉప దేశికుఁడైనచో అఱువదినాలుగు విద్యలును అఱువది నాలుగుదినంబులలో బోధించెనన నాశ్చర్య మేమున్నది! ముందుకథయందఁ జతురంగ బలసమేతులును జతురులును సగు రాజన్యులతో శ్రీకృష్ణుఁడు పోరొనరింపవలసియున్నది. బాల్యక్రీడలందు శ్రీకృష్ణుఁడు కావించిన అద్భుతకృత్య ములయం దాతనికి భగవంతుఁడు తోడ్పడియుండిన నుండవచ్చు. ఇఁక ముందుకథయందు వెట్టి మొట్టి గొల్ల సుద్దులవలనఁ గార్య ములు కానీరవు. కావుననే వసుదేవుఁడు ఆర్యావర్త రాజకీయ నాట్యరంగమున ముందు కృష్ణుండాడనున్న మహాభారత నాటక మునకుఁ గావలసిన విధానములు నెఱుంగఁగావలయు నవంతీపుర మునకంపెను. లౌకిక వైదిక వ్యవహారముల నారి తేరిన సాందీపని అభీరకృష్ణుని ఆర్యకృష్ణు నొనర్చి, అఖిల రాజతాపనలోకంబు చే మన్న నలంచు నంత వానిగఁ జేసెను. చాణక్యుఁడు చంద్రగుప్తుని చేపట్టి అతని మగధసింహాసన మెక్కించుటకుఁ గావలసిన సాధనసామగ్రిఁజేకూర్చినట్లు, సాందీపని శ్రీకృష్ణుని ఆ నాఁడు భారతవర్షమందు సూత్రధారిగ నుండఁజేయుటకే కావలయుఁ గావలసిన విద్యాబుద్ధుల నెల్ల నలవడఁజేసి పంపెను.

దుష్ట సంహరణము—శిష్టరక్షణము

కంసవధతో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు ముగిసినవి; కాని నాఁటినుండియు నాతఁడు బలసంపన్నులగు రాజాధిరాజులతో ఁ బో రొనరింపవలసియుండెను. భోజకులు యాదవజాతియందలి అంతశ్శాఖ వారగుటచేఁదత్కంస వధ ఆర్యావర్తమున నొకజాతి అంతఃకలహముగఁ బ్రజలచే భావింపబడి యు పేక్షింపఁబడెను. కురు పాంచాలాధీశుల చేఁ గంసుని కౄరకృత్యములచే, ననేకులు యాదవవీరు లాతనియెడ నసంతృప్తిఁ జెందియుండిరి. కావున శ్రీకృష్ణునకుఁ గంసవధ అంతకష్టమీయలేదు; కాని కంసుని మరణానంతర మాతని మామయగు మగధాధీశుఁడు శ్రీకృష్ణు నితో నంతులేని పంతమూని పోరఁజొచ్చెను. కంసుని మరణమున నాతనిభార్యలగు అ స్త్రీయుఁ బ్రాస్త్రీయు విధవ లై దుఃఖించుచుఁ దమతండ్రియైన జరాసంధునగరంబునకుం జని తమతండ్రితో నిట్లనిరి:— శా॥ వాఁడ్రున్ వీండ్రును రాజులేయనుచు గర్వప్రౌఢితో యాచవుల్
| 'వేండ్రంజైన బలంబుతో మథురకున్ వేవచ్చి నిష్కారణం
బాండ్రున్ బిడ్డలు బంధులున్ వగవఁ గంసాది క్షమానాధులం
దండ్రీ! చంపిరి; కృష్ణుచేత నీటు వైధవ్యంబు వచ్చెం జుమీ
|| అనిన విని ప్రళయకాలానలంబు తెఱంగున మండిపడి శోక రోషంబులు బంధురంబులుగా జరాసంధుం డిట్లనియె.
శా॥ యేమీ కంసునిఁ గృష్ణుఁడే రణములో హింపించె నోచెల్ల! నా
సావర్థ్యంబు వలంపఁ, డించుకోయు మచ్చిండప్రతాపానలో ద్దామార్చుల్ నాడి నేఁడు గాల్చు యదుసంతానాటవీ వాటికన్
భూమిం గ్రుంగిన మింటఁ డాఁగిన వహాంభోరాశిలోఁ జొచ్చినన్ ॥
అని జరాసంధుఁడు శ్రీకృష్ణుకడ కిట్లు కబురంపెను. కం. “నీకొండె బ్రతికియుఁడుట,
నాకొండెంగాక గోపనందన, విమ మీ లోకంబున నిన్దరకును నేకసమయవృత్తి పొసఁగునే యిటమీఁదన్.” ఆమాటలకు శ్రీకృష్ణుఁడు దిగులొందక మందహాసం బొనర్చెను. జరాసంధునకు బలమధికముగనుండుట నాతఁ డెఱుంగును, జరాసంధుని పక్షమూనియుండిన రాజు లనేకు లుండిరి. పౌండ్ర కళింగ కరూశ చేది సాళ్వ విదర్భ యవన వేణుధారి సౌవీర గాంధార త్రిగర్త కామరూప దేశాధీశులును మఱియు అంగ వంగ సుహ్మ విదేహ కోశ కాశ దశార్ణ మద్ర పాండ్య దేశాధీశులును జరాసంధుని యాజమాన్య మంగీకరించి యుండిరి. ఇంక యాదవులకన్ననో ఆనాడు బలమధికముగ లేకుండెను. కావున జరాసంధుని బలంబుఁ గ్రమక్రమంబుగఁ గృష్ణుండు సంహరింప సమకట్టెను. అందుచేత నే కృష్ణుం డన్న యగు జలరామునితో నిట్లనియెను:--
ఆ. "మగధ నాధుఁ బోర పడియింపఁ బోలదు,
మడియకున్న వీఁడు మరలి మరలి
బలముఁ గూర్చుకొనుచుఁ బఱ తెంచుఁ: బతేరఁ
ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ.”
అఖండభారతవర్షంబున నన్ని తావులకు వ్యాపించిన ఆజరాసంధ వ్యాధిని ని శ్శేషముగ నిర్మూలించుట కప్పటికిఁ దగిన బలంబులు లేమి శ్రీకృష్ణున కెక్కుడు కాలముపట్టెను. కృష్ణుండు తాను మధురానగరంబున నుండుట అపాయ కరంబని యెఱింగి యాదవ వీరులతో నాలోచించినంత, వారిలో నయక ళానిర్ణి, దుండగువిక ద్రుండను యదువృద్ధుండు వానికి ట్లనియె:
“అపరిమిత నృప సహాయుఁడు,
కపటోపాయుఁడు గకోర కర్మనిపుణుఁడు ”
ఆ జరాసంధుఁడు
“పాటు వచ్చి గదియవిడి సె”,
కంసుండు బలగర్వితుండ గుటం జేసియు, నీ మధురానగరంబ న ముట్టడిసమయమున వలయు ధనధాన్యాదులును, ఆయుధంబు లును సంగ్రహింపఁ బడకుండుటంజేసియు, నిప్పురంబు దుర్గంబసి నమ్మ రాకయున్నది: కావున:
కం. "విను దక్షిణాపథంబువ
వనజేక్షణ, తనరు ఋవ్యవంతము వింధ్యం
బును సహ్యము ననఁగాఁ గల
యనుపమశైలములు బహుగ్రహన సంకటముఖ్.”” తొల్లి ముచికుందుండు, పద్మవంతుండు, సారసుండు, హరితుం పడమటి డను పేళ్లుగల యదువంశభూపతులు నలువురు వైరిభయనివార ణార్థంబై కావించిన దుర్గంబు అనేకంబులు కలవు సముద్రంబులోని దీవులును బహువిధంబులు. ఈ నలువురు అనుజులకును బెద్దవాఁడైన మాధవుండే తొల్లి ఈ మధురానగర మును బాలించుచుండెను”. వికద్రుని పలుకులాలించి కృష్ణుండి కొక దుర్గమప్రదేశం బన కేగుటకై సకలజనంబులకు నిర్గమసన్నాహం బోజ్ఞాపించెన నాలో నన,
ఆ. "కాలయనుఁడనఁగఁ గాలికల్పుఁదు వఁత్ర,
నేచి వధులమీఁద గురిం
గపలె ననికి ఇప్పుడ యొడం జరాసంధుల
డును గడంగె ననియు వినియె నొకట.”
* ఈ కాలయవనుఁడు జరాసంధుని ఆహ్వానంబున నా ర్యా వర్తముపై దాడి వెడ లేను.
కాలవిలంబ మొనర్పక శ్రీకృష్ణుఁడు సకుటుంబులగు వృక్ష్యంధక వీరులం దోడ్కొని సమస్త సంపదలతోడ సాగరా నూప ప్రదేశంబచేరి, ‡ మందరమునకు నెనయైన దైవత కాద్రిచేరువను ద్వారవతీనామకంబగు పురంబు నిర్మింప, శాత్ర వులవలని భయంబువిడిచి యాదవు లందుండిరి. శకదరద పారదాదులును, హిమశైలాశ్రితులగు దస్యులుం దనకు విధేయులు గావున నిరవధికసేనా సముదాయంబులతో ఁ గాలయవనుఁడు మధురపై కేతెంచెను. కృష్ణుడు తనవారి నం దఱినిద్వారకయం దుంచి తా నొక్కండ పాదచారియై మధురకు వచ్చెను. వానిఁబట్టుకొనుటకుఁ గాలయవనుఁడు ఆయుధములు గైకొనకయే తనవారిని వీడి వచ్చెను.
కం. “చేయీక వాని మొనలకుఁ
బాయఁగ వెలయించి నవ్వు పఱచె సవధ్యో
పాయుఁడు హరి యడు గడుగున్
జే యందినయట్లు యాసనేయుచు వీ;న్.”,
ఇరిగియరిగి, దేవతలచే వరంబుఁగొనిన ముచికుందుని చెంత కాతనిఁగొనివచ్చి,ఆతనిచే యవను నంత మొందించెను. కృష్ణుఁడు మఱలివచ్చి, మధురానగరంబున విడిసియున్న యవనముఖ్యుల నెల్ల వధియించి, యపరిమిత రథగజతురగ సముదాయంబులం గైకొని యవిలంబితగమనంబునం ద్వారకకు విచ్చే సెను. వింధ్యపర్వతంబునకు దక్షిణ పార్శ్వంబున భీష్మకుండను భోజనృపు డేలుచుండెను. ఆతని కుమారుండగు రుక్మి జరా సంధునిషు మూనియుండెను. శ్రీకృష్ణుఁడు వారి నెటు లైనను దన వారిగఁ జేసికొన నిశ్చయించెను. అందుచేతనే శిశుపాలున కీయ నిశ్చయింపఁబడిన ' రుక్మిణిని దాను గైకొనిపోయి రాక్షసవిధిని వివాహమాడెను. త న్నెదిరింపవచ్చిన జరా సంధాదుల నోడించి పారఁదోలేను. తరువాత రుక్మి కృష్ణుని పక్షమూని ఆతనితో బాంధవ్యము లనేకములు గావించుకొ నెను. కానికొంత కాలమైనతరువాత రుక్మికిఁబొ త్రియగు రుక్మవతియను కన్యను అనిరుద్ధునికిచ్చి వివాహ మొనరించు దినములలో రుక్మి కొందఱి దాక్షిణాత్యరాజుల ప్రోద్భలంబున బలరాముని జూద పరిభవిం; (జూచెను. ఆనాడు దాక్షిణాత్య మాడఁబిలచి భూములయందు కాళింగులే ముఖ్యులుగనుండినట్లు కాన్పించును యాదవులఁలుకుబడి దక్షిణాపధమున నానాఁటి కభివృద్ధియగుల గాంచి, కాళింగప్రభువులగు వేణు ధారియు, శ్రుతవర్ముండును, అంశుమంతుండును, జయత్సేనుండును దమలో విచారించి రుక్మి పాలికిం జని యేకాంశంబున నతని కిట్లనిరి: -
ఉ. " నెత్తముమీఁ:ఁ గౌతు శము దుర్భరమై జనియించె నిప్పు మా
చిత్తములందు నీవు గడుఁ జిత్రపుజూదరి వాత్మలోన ము
దృృత్తుఁడు సీరపాణి కడు వేడుక నాతనిం జయింతు. మే
మిత్తఱి విన్మొకింతే గవియింపు మొనర్పుము తత్ప్రసంగమున్ .”
వారిమాటలు ననుసరించి రుక్మి బలరామునిజూదమాడఁ బిలిచెను, ఆజూడమున బలరాముఁడు రుక్మినిబరిహసించి, రుక్మికిఁ దోడుగ నే తెంచిన కాళింగుని తల పగులనడఁచి పండ్లు దులిపి చంపెను. ఆనాఁడు తనయన్న యొనర్చిన కార్యములకు దానన్న పై నలిగినను, నాఁటినుండియు రుక్మి పక్షము లుడిగిన పక్షి యగుటచే, దక్షిణాపథ భోజకులను (విదర్భభోజకులు) గూడ శ్రీకృష్ణుఁడు. తనకు దాసులుగఁ జేసికొనఁగలిగెను. కంసుని మరణమున మధుర భోజకు లిదివరకే కృష్ణునకు వశంవదులై యుండిరికదా! ་ ఇట్లుండ నా కాలమునఁ బ్రాగ్జ్యోతిష మేలుచుండిన నర కుండనుమహాదనుజ రాజు బదరీవసంబునఁ బుణ్యయజనతత్పరు లై కూడియున్న తపస్విపుంగవులకుఁ బెక్కు బాధ లిడుచుండెను. అప్పటికి దక్షిణాపథంబున తన పలుకుబడి నదిక మొనర్చి కొని శ్రీకృష్ణుం డుజ్వల తేజోవంతుడయియుండెను,
లే "అగ్నులార్చి హోతల నొంచి, యఖిల యోగ్య వస్తు విస్తారములను విధ్వసములు గం
జేసి, యాఁడు వారల కెల్లఁ జెఱలునట్టి కొనుచుఁ బోయె
ఇట్లు ఇరకుండు భామినుల కెక్కుడు బాధగలిగించుట విని శ్రీకృష్ణుఁడు అతని సంహరింప సత్యభామా సమేతుండై ప్రాగ్జ్యో తిషంబున కేతెంచెను. త మ్మెదుర్కొన నరకుం డే తేరునంతఁ గృష్ణుండు నగుచు సత్య మొగంబునం జూడ్కి నిల్చి, నీవు కయ్యం పుమోపు మోవుమని నాభామిని చేతికిఁ దన శార్ణంబిచ్చిన, నయ్యింతి కొంతవడి పోరొనర్చి వరకు నిరధంబు, సారధిని దుని మెను. స్త్రీలు పురుషులవిలాసార్థం బీశ్వరునిచే సృష్టింప, బడిన క్రీడాపరికరములుగ భావించి, వారిని తన యిచ్చవచ్చిన ట్లుపయోగించుచున్న నరకుం డానాఁడు స్త్రీలుసర్వశ క్తి స్వరూపి ణులని గ్రహించి రిత్తబోయిన మనంబున వెనుక కేగి, కొండొక రథంబుగొని కయ్యంబున 'కేతెంచెను. నరకుఁడు మఱలివచ్చి గంత కృష్ణుండు చక్రప్రయోగం బొనర్చి అతనింగడతేర్చి, నరక పుత్రుండగు భగదత్తునకుఁదండి రాజ్యంబిచ్చి, నరకునిచేఁగారా గారమందుంచఁబడిన పదియాఱు వేల దేవకన్యలను విడిపించెను. ప్రాగ్జ్యోతిషమునుండి మగిడివచ్చు మార్గంబున దేననివాసంబున కేతెంచి అచ్చటి పారిజాత వృక్షమును వేళ్ళతోఁ బెఱకి ద్వా రక్షకుఁ గైకొనివచ్చెను, బలముడిగిన దేవతలకు భాగ్య భోగ్యంబు అనవసరములని కాఁబోలు కృష్ణుఁ డట్లు గావించెను. తండ్రి రాజ్యంబు కొడుకగు భగదత్తున కిచ్చి వేసినను, ఆతని సిరియుసంపదయు నెల్ల ద్వారకకుఁ గొంపోవుటను గృష్ణున్నిపై భగదత్తునకు దీఱనిపగ యుండెనన నసంభవ మేమున్నది! నరకసంహరణమునకు శ్రీకృష్ణుని నాహ్వానింప నరుదెం చిన ఇంద్రుఁడేఆనాఁటి దుస్థితినిగూర్చి, శ్రీకృష్ణునితో నిట్లనియెను:
చ “నరకుఁడసంగ దైత్యకుల నాథుఁ డొకండు సరోజునూతి చే వరములు గాంచి పేర్చి సురవర్గము వెల్లను గాలిచేసె సం
గరమున నేము వాని భుజగర్వము నైఁపఁగలేక యిందులన్
సిరిలుఁ దొఱం (లం) గి నచ్చితిమి చెన్న టీ మానువ జాతిలోనికిన్” ||
ఇట్లనుట వలన అధికారసంపన్ను లై సకలభోగము లను భవించుచుండు నరులే దేవతులుగా పరిగణింపఁబడు చుండిరని తెల్లమగుచున్న ది. అందువలన నేగద యిప్పటికింగూడ, అధికార సంపన్నుఁడై, సకల వైభములఁ గూడియున్న వానిని ఈ జన్మము ననే దేవేంద్రుండనియును, ఆతని పదవిని దేవేంద్రపదవి యని యును, వాకొను నలవాటు వాడుకలోనికి వచ్చినది.
ప్రాచీ దేశ ప్రాంతమున వింధ్యపర్వత సమీపభూములయందు (ఇంచుమించు పాతాళమున) మహారణ్యముల మధ్యనోక పురంబు నిర్మించుకొని (శోణపురము) ప్రహ్లాదుని మనుమఁడగు బాణుఁడు రాజ్యమేలుచుండెను. ఈతఁడు కలకాలము ఆర్యావర్త ముతో నెట్టిసంబంధమును లేకయుండెను. కాని కొంత కాలమున శాతని కూఁతురగు ఉపాకన్య అనిరుద్ధకుమారువరించి, చిత్ర రేఖ యను తన చెలియల నంపి నాయాదవవీరుని శోణపురమునకు మాయచేసి కొంపోయెను. కృష్ణుండు కొంతకాలమున కని రుద్ధుని దురవస్థవిని బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ప్రముఖులును, యదు వృష్టి భోజాంధక వీరవరులును వెంటరా శోణపురంబు చేరఁ జనెను, మార్గమధ్యంబున మహారణ్యంబున బలభద్రునికి శివ జ్వరము వచ్చెను. అయ్యది అరణ్యప్రదేశమగుట, మలేరియా జ్వరములట మెండు. అట్లగుటను:
ఆ మూడుకాళ్లు తలలు మూడును గల్గిన, జ్వరమువచ్చి తాఁకె సరభసమున.”
అపుడు కృష్ణుండు:
ఆ "తాఁకి యీజ్వరంబు తనచేతనున్న భ
స్మము సమంత్రకముగఁ జట:లవృత్తి
1 మలేరియా జ్వరమునకు మూలనుగు క్రిములు మూడు తలలును, మూడు కాళ్లును గలయట్టివికా రూపించును. నోరు లెఱుంగకుండ మరుసత్వనిధియైన, సీరపాణివిఁడఁ జిమ్ముటయఁను.”
అనంతరము :

మ|| "పరమాత్ముండగు శౌరి యప్పు శనల ప్రాయంబు మా హేశ్వర
జ్వరవర్పం బణఁపం దలంచి నిజ తేజస్ఫూర్తి శోభిల్ల దు ర్భర
1 హైమంబగునట్టి శీతము జనింపంజేసి పొమ్మన్న

అప్పుడు శ్రీకృష్ణుఁడు మంచు సృష్టించి అన్న నందు కప్పియుంచి ఆతనిజ్వరమును శాంతింపఁజేసెను. తరువాత యదువీరులు బాణునితో యుద్ధ మొనర్చి, అతని బాహుగర్వ ముడిపి, ఉషాసుందరి సనిరుద్ధునితోఁ గనకరథంబున నిడుకొని ద్వారక కేతెంచిరి.
శ్రీకృష్ణుఁడు ఆ ర్యావ ర్తమందుండిన పురాతన రాజకుటుం బముల వారిని దాను స్వయముగ సంహరించుటకు సంక ల్పించుకొని యుండ లేదు. అందుచేతనే మగధాధీశుఁడైన జరా సంధుని వధియించుటకు వేటొకనిని వెదకుచుండెను. యాదవు లార్యావర్త రాజకీయ నాట్యరంగమున నాట్యరంగమున స్వయముగ్ద జోక్యము ఈ మొదలగునవి శ్రీకృష్ణునకు విదితమనుట కాదా! మంచులేయారు చేయుట, మంచుగడ్డతో జ్వరచికిత్సచేయుట, మొదలగు విషయ ములకు మనపాశ్చాత్యసోవరు లేఆచార్యులని వఱియిఁకనవఁదగదు. కలిగించుకొనినచో, ఆర్యవంశపు క్షత్రియులందఱు నేక మై సూద వులతోఁబో రొనరించినచో, భరతవర్షమున సురాసుర యుద్ధము లట్లు, యాదవ ఆర్యయుద్ధములు ప్రారంభమై ఎక్కుడుజనక్షయ మునకుఁ గారణమగును. అందుచేత శ్రీకృష్ణుఁడు ఆర్యావర్త నృవులలో నగ్రేసరులును పౌరవ్యులలోని వారును నగు పాండ వేయులనే తనఉ దేశముల నెఱవేర్చుకొన సాధనములుగ నెన్ను కొనెను. ఆర్యావర్తమందుండిన రాజవంశముల కెట్టి మనస్పర్థ లుండెనో చూతము:- పాంచాలురకు నానాఁటికి బలమధిక మగుటచే ద్రుపదుఁడు పొగ రెక్కి అచ్చోనుండిన బాహ్మణులఁ జులుకనగఁ జూడ మొదలిడెను. అందులకు ద్రోణాదు లలిగి, పుత్ర మిత్రకళత్రాగ్ని హోత్రం శిష్యగణంబులతో హ స్తిపురంబుఁ చేరిరి. భీష్ముఁడు ద్రోణుని గురురాజుకొమరులకు అస్త్రవిద్యగఱ పుటకు నియోగించి గౌరవించెను. ఆబాలుర నస్త్రవిద్యాపారం గతులఁగావించి, వారిని వెంటఁగొని ద్రోణుఁడు ద్రుపదుని బరిభ వింపనే తెంచెను, ఆయుద్ధమున నర్జునుఁడు ద్రుపదునిబట్టి కట్టి తెచ్చి, ద్రోణునెదుటఁ బెట్టెను. అంతట ద్రోణుఁడు మందస్మిత వదనార విందుఁ డై ద్రుపదునితో:
ఆ. “ఇంక నైన మమ్ము నెఱుగంగ నగునొక్కొ?......” అని యుల్ల సములాడి ద్రోణుఁ డాద్రుపదుని విడిచి పుచ్చెను. విప్రు నలుకయు, దృణహుతాశనంబును దీర్ఘంబుగ నుండునవి గనుకనా! పాండువిభుని మరణానంతరము కృష్ణద్వైపాయనుఁడు కుంతీపాండవులందెచ్చి హస్తినాపురమున విడిచి సత్యవతి కేశాల తంబున నిట్లనియె. క. "క్రూరులు విలుప్త నిర్మాత
చారులు ధృతరాష్ట్ర సుతు లసద్వృత్తులు ని
ష్కారణపై రులు వీరిల కారణమున నెగులు పుట్టు గౌం వ్యులకున్"||
అందుచేతనే సత్యవతి కోడండ్రగు అంబికాం బాలికలం, దోడ్కొని వనంబునకుఁ దపంబు సేసికొన నేతెంచెను. అప్ప ట్టున నామె పారాశర్యునుప దేశంబు భీష్మవిదురుల కెఱింగించెను. అందుచే భీష్మ విదురులు ధృత కాష్ట్రునకు బోధించి పాండవులను వారణావతముల కనిపిరి. కాని దుర్యోధనాదులు పాండవుల కపకారము ఘటింపనెంచి, పురోచనుండను తమముఖ్య కార్మి కునంపి, వారణాశితం బున నాయుధ శాలా సమీపంబున ల పరకర సమిశ్రం బై మృత తైలార్ద్రంబయిన మృత్తికా పుంజంబున నొక్క చతుశ్శాల నవిరళ సంధాధవళితంబుగా నిర్మించి, అం దుఁబాండవుల నుండఁబంచిరి. పరాభిప్రాయ మాయోపాయ ప్రయోగవిదుండై న ధర్మతనయుండు తమ్ములతో నిట్లనియెను.
"ఎఱిఁగితిమి దీన తెఱగే మఱ కెఱుఁగని యట్లు గూఢమతి నుండుడ మిం
గాన్సించుచుండిన ఆపాండవులతోఁ బోర నుంకించుచుండ,
శ్రీకృష్ణుండు పాండవుల క్షేమము గోరి వారల కిట్లనియె: చ||
పరులకు దుష్కరంబయిన భాసుర కార్యముఁ జేసి, తత్స్వయం వరమున బత్నిఁగాఁబడ పై వారికుహాయక క్షేత్రఁ గృష్ణ నీ ధరణి సురాన్వయోత్తముఁడు; సర్మంధింజెపుఁడయ్య యింక నె వ్వరికిని జన్నె వీని నినవిద్యప రాకము నాకమింపఁ కృష్ణునిచేత నివారితులై రాజపుత్రులు తమతమ దేశం బులకుంజనికి. బలభద్ర సమేతుండై కృష్ణుండు పాండవులున్న తావునకుఁజని తమ్మెఱింగించి, వారి సేమం భారసి ——అర్జునుండు తానార్జించి తెచ్చిన పడితిని తల్లి ఆజ్ఞానుసారము అందఱి అన్న దమ్ములతో సమముగ ననుభవించుట కంగీకరించుటఁగాంచి, ఆశ్చర్య నిమగ్నుండ య్యెను. నవయౌ వనుండగు వీరాధివీరుఁడు తాను సర్వరాజసమక్షంబున నార్జించి తెచ్చిన త్రిలోక సుందరిని తనతక్కిన అన్నదమ్ములు తనతో పాటుగ భార్యగ ననుభ దాను లోభమించుకంతైనా లేక సమ్మతించిన వ్యక్తి ఎంత స్వార్థ త్యాగి! అట్టి ఉదార స్వభావునిరావు మహ త్తర కార్యములుదు ముందుంచుటకుఁ గృష్ణుఁడు నిశ్చయించు కొనెను. పాంచాల యాదవ సాహాయ్యము పాండవులకుఁ బ్రాప్తిం చుటచే ధృతరాష్ట్రుండు దిగులొంది పాండవులం దోడేర ద్రుపదుపురంబునకు వికురు నంపెను. వారు హస్త్రీపురంబున కేతెంచినతరువాత ఆవృద్ధ కుకుపతి కృష్ణుండును సకలవృద్ధ రాజులనుంగల సభయం దద్ద రాజ్యము పాండవులకిచ్చి వే సెను. అపుడు ధృతరాష్ట్రు డిట్లనియె, ఆ "సర్వలోకకర్మసాక్షి కృష్ణుండు సాక్షిగాఁగ మీకు సకలవృద్ధ రాజులొద్ద నర్ధరాజ్యమిచ్చితిఁ బాండు రాజు విభన వెల్ల రక్షణఁ గొనుఁడు" ఖాండవప్రస్థము నివాసముఁ జేసికొనియుండుఁడని పాండవుల నావృద్ధ రాజునియమిం చెను. అంత శ్రీకృష్ణునిఆ దేశము పై ఇంద్రుఁ డంప విశ్వకర్మ వచ్చి సురపురమున కెనయగు పురము నిర్మించి యద్ధానికి ఇంద్రప్రస్థమను నామకరణ మొనర్చి చనెను. అర్జనునియెడ కృష్ణునకు ప్రేమమధికముగ నుండుటచే, బలదేవాదు లెఱుంగకుండ సుభద్రార్జునులకు వివాహంబు నేయ సమకట్టి పశుపతి పూజా మహోత్సవ వ్యాజంబున నఖిల చదవ భోజాంధక వృష్టి వరులతోఁ గృష్ణుండంత ద్వీపంబునకుంజనియె. యతిరూపంబున ద్వారక కేతెంచియుండిన అర్జనుండు కృష్ణుఁడు పంచిన మార్గం బనుసరించి సుభద్రం దోడ్కొని పోవుచుండ పృథశ్రవసుఁ డాదిగాఁగల యదువీరు లా యతిరథంబున కెదు రై నిలిచిరి. తనకు సుభద్ర తేరుగ డపుచుండ, నమితమగు యదు సైన్యముల నోడించి అమరేంద్రసుతుఁ డనిలో లబ్ధవిజయుఁడై పరమోత్సాహంబున నరి గెను. ఇట్లగుటచే, సుభద్ర నర్జునుఁడు గైకొనుట యాదవు లిష్టపడలేదనుట కాదా! తరువాత నర్జున సమేతుఁడై కృష్ణుండు వెడలి ఖాండవ వనము దహింపఁజేసెను. ధృతరాష్ట్రుఁడు పాండవుల కిడిన భాగ మందు ఖాండవవనముండెను. ఆసుభికమగు ప్రదేశ మొకప్పుడు దేవేంద్రుని స్వాధీనమందుండుటచే నాకఁడు కృష్ణార్జునులతోఁ బోరనే తెంచెను. కాని కృష్ణార్జునులింద్ర నోడించి ఆతనికడనుండిన దివ్యాస్త్రంబులఁ గైకొనిరి. అర్జునుం డాదవానలమున మ్రంద నుండిన దానవవిశ్వకర్మమైన మయుని రక్షించి యాతనివలన నొక దివ్యసభయు, భీముని ఉపయోగార్థము గదయుఁబడ సెను. నాఁటినుండి దానవవిశ్వకర్మమైన మయుఁ డనుచరసమేతముగ నార్యావర్తము వీడి సముద్రాంతర భూములకు వలసపోయెను. ఈతని సంతతివారే మధ్య అమెరికా దేశమునందు నూతన నివా సము లేర్పఱచుకొని ఎక్కుడుగ నభివృద్ధిఁ జెందిరి. వారి పట్టణ ములకట్టడపు రీతులు, దేవళముల పైనున్న చిహ్నములు, నేఁ డనేకములు గాన్పించుచున్నవి.* వరుణ దేవునిచే వెంటాడఁబడిన అసురులు పశ్చిమదేశం బుల కేగిరి. కృష్ణార్జునులచే వెంటాడఁ బడినవారు (కాలకేయ, నివాతకవచులు) హిందూమహాసముద్రమందలి దీవులకును, బిమ్మట శాంతమహాసముద్రము దాఁటి అమెరికా దేశమునకును వలసపోయిరి. మునివేరితుఁడై ధర్మజుఁడు పితృతిగ రాజసూయముఁ జేయను ద్దేశించి, తనకో ర్కె శ్రీకృష్ణునకు విన్నవించిన నాతఁడు: “పరశురాముచే ధాత్రి యపగతక్షత్రంబయ్యె, అంతనుండియైల వంశంబును నిక్ష్వాకువంశంబునుందక్కఁదక్కినక్షత్రియవంశంబు తెల్లఁగృత్రిమంబులయ్యె; యయాతిభోజవంశంబులు చతుర్దిశలను వ్యాపించే; అయ్యవి తరువాత జతుర్దశవంశంబు లయ్యె. ఇట్టి సకలక్షత్రియవంశంబులఁ జయించి అసురపక్షపాతియగు జరాసంధుండున్నవాఁడు. వానితోడి వైరంబు బలవంతంబగుటం జేసి మేము మధుర నుండనొల్లక కుశస్థలంబునకువచ్చి రైవతక పర్వతంబున ఘనంబుగా దుర్గంబు నిర్మించుకొని భవదాశ్రమం బున సుఖంబున్న వారము. చ ఖలుఁడు బృహఙథాత్మజుఁడు గర్వితుఁడై మహలోని రాజులం బెలుకుఱఁబట్టి తెచ్చి చెఱఁడెట్టి గిరిప్రజ మన్పురంబులోఁ బొలయక నిత్యమొక్కొకని సూసరిబోలె ఎధించి నేమమున్ బలిమియు నేర్పడం గడఁగె భైరవి పూజయొనర్చు సుత్రుఁడై అట్టివానింజంపినంగాని సామ్రాజ్యవిభవము మీకు సుస్థిరంబు కానేరదు.” అని యనియె. ఆమాటలువిని సమబలుండగు భీమనేనుండలిగి, యన్న కిట్లనియె:
క|| "ఈ హరికరుణయు సర్జను,
సాహాయ్యముఁ గలుగ నీ ప్రసాదమున జగ
ద్రోహు జరాసంధు మహా,
సాహసు విధియింతు నుగ్రసంగ్రామమునన్.”
భీముండుగాని యొండొరులు మాగధుని వధియిపం సమర్థులు గారని కృష్ణుఁ డెఱుంగుట ధర్మజున కిట్లనియెను:— న! "విను మగధేశ్వరుఁ డెపుడు విప్రజనాళియంను భక్తి యున్ వినయముఁ గల్గి యెద్దియును వేడిన-లో వృన చేయకిచ్చుఁ గా వునఁ దగనర్జునుండు పవనోూపుఁ డేనును బ్రాహ్మణాకృతిం జని రణభిక్ష వేఁడిన వశేంచనుఁడై యతఁణిచ్చఁ గోరికల్" " ధర్మజు ననుమతి భీమార్జునుల వెంటఁగొని బ్రాహ్మణ వేషంబులు డాల్చి గిరిప్రజంబు సొచ్చి జరాసంధునిచే నతి పూజలంది కృష్ణుఁ డమ్మగధనాథున కిట్లనియెను: "మామక కీసలె నాజభిక్ష యితఁ డింద్రతసూచవుఁ డేను పేంద్రుఁడెన్, బావని యీతఁ డింకొకని బైకొని యెక్కటి పోరఁగాసన్” కృష్ణునిపలుకులకు జరాసంధుండు నవ్వి దోర్బలశక్తికిఁ దుల్యుఁ డీమరుత్సూనుఁడు, వీల నెనుర్తు” నని చెప్పి, బురి వెలికేగి యచట సమతల భూమిని భీముతో గదా యుద్ధంబునకు గడంగెను. “ఇవ్విధంబున వారు బోరుచుండ, కృష్ణుండు జరాసంధుని జన్మమరణ ప్రకారంబు లెఱుంగుటం జేసి సమీరనందమండు సూచుచుండ నొక్క శాఖాగ్రంబు రెండు గాఁ చీఱివైచిన, నతండు నాకీలు దెలిసికొని మాగధునింబడ ద్రోచి వానిపదంబు పదంబునం ద్రొక్కి బాహుయుగళంబున రెండవపదంబు పట్టి మస్తకపర్యంతంబు వ్రయ్యలు చేసి చంపె. అప్పుడు శ్రీకృష్ణుఁడు జరాసంధసుతుఁడైన సహదేవుని మగధకు పట్టాభిషిక్తుగావించి, గిరివ్రజమునుండిన రాజుల బంధవిముక్తులఁ కేసి వారల కిట్లనియె:
ఉ॥ "మీరలు ఫర్మముల దగవు మేరయుఁ దప్పక భూజనాళిఁ జెం
పారయ సౌఖ్యసంపదలు నందగ బ్రోచుచు భూరియజ్ఞముల్
గౌరవసృత్తి మత్పరముగా నొనరించును మామకాంథ్ర పం
కేరుహముల్ భజించుచు నకిల్బిషులై చరియింపుఁ డిమ్ములన్.”
సూత్రప్రాయముగ శ్రీకృష్ణుఁడు తన జీవితాశయముల నిందుఁ జెప్పి యే యున్నాఁడు. ధర్మజుఁడు రాజసూయయాగంబు ప్రారంభించి, వచ్చినవారి యందఱుపూజార్హు లెవ్వరని సదస్యులనడిగిన, వారందఱును శ్రీకృష్ణుఁజూపిరి. అంత:
కం॥ "బండత్కాంచిన రుచితో,
దంచిక వస్త్రముల నూత నార్క ప్రథలన్
మించిన రత్నములం బూ
జిందెన్ ధర్మజుఁడు కృష్ణు జిష్ణు సహిష్ణున్.”
ఈ రాజసూయయాగంబువలన యుధిష్ఠిరునకు సార్వ భౌమతయును శ్రీకృష్ణున కార్యావర్తరాజలోకంబున నద్వితీయ పురుషుఁడను మహాగౌరవమునుం గూడ నేక ముహూర్తంబునఁ బ్రాప్తించెను. యుధిష్ఠిరునవివేకమువలన తరువాత పాండవులకు కొన్ని దురవస్థలు ప్రాప్తించెనేగాని, రాజసూయయాగముతో శ్రీకృష్ణు సంకల్పములు నెఱవేతె ననియే చెప్పనగును. జరాసంధుని ముఖ్య సేనాపతియు, స్నేహితుండునునై న చేదిపతియే శిశుపాలుఁడు, శ్రీకృష్ణునకుజరిగిన గౌరవముచూచి సహింపలేక, పీఠముడిగ్గి నిలచి సభాసదులంజూచి యిట్లనియె:
తే|| "బరగమన్ను యయాతి శాపమునఁ జేసి,
వాసికెక్కదు యీ యదువంశేషల్ల
బ్రహ్మ తేజంబునెల్లఁ గోల్పడిన యితిఁడ:,
బ్రహ్మ ఋషి నేవ్యుడగు గోపాలకుండ?”
అమ్మాటలకలిగి ముకుందుం డాగ్రహంబున లేచి తటాలున శిశుపాలుని పైఁబడి దన చక్రంబున దునిమెను. శిశుపాలుని సంహరించుటచే సాల్వుఁ డలిగి మయ నిర్మితమైన 'సౌభక' మను కామగమనముగల తన వ్యోమ యానముతో ద్వారక పైఁబడి అద్దానిఁ గొల్లగొట్టెను. సాల్వుని సౌభక విమానమిట్లు వర్ణింపఁబడియున్నదీ
సీ॥ *"ఒకమాటు నభమున బ్రకటంబుగాఁదోఁచు,
నొకమాటు ధరణిపై నొయ్యనిలుచు
నొకమాటు శైలమస్తకమున ఐర్తించు,
నొకపరి ఐరియుంచు నుడధినడుమ..”
రాజసూయమునుండి వచ్చిన తరువాత కృష్ణుఁడు కల కాలము సాల్వునితో పోరినఁగాని 'వానిసంహరించుట సాధ్యము కాలేదు. కృష్ణుఁడు సాల్వునితో నిరంతర యుద్ధముల నిమ గ్నుఁడై యున్నపుడే ధర్మజుఁడు జూదమాడి, రాజ్యము సర్వ స్వము కౌరవులకోడి, కానల కేగెను. మయసభ చూడనేగినప్పుడు, అచ్చోనుండిన చిత్ర విచిత్రంబులఁగాంచి దుర్యోధనుండు మతి చెడి అవివేక కార్యంబు లాచరింప మొదలిడుట చేఁ గొందతాతనిఁజూచి నవ్విరి. అందు శాతఁడు కనలి మయసభ తన్న గౌరవించుటకే కల్పింపం బడినదని తలంచి యుధిష్ఠిరు నెటులైన పరిభవించి వాని రాజ్య మపహరింప వలెనని సిద్ధసంకల్పుఁ చేయండెను. ధర్మజుని జూద మాడ బిలిచిన చో నీకోర్కె లీడేర్తు' నని శకునియ నెను, ఆనాఁడు రాజులలో జూదమాడుటతప్పుకాదు. కావున తమ్ముని అహ్వాన మంగీకరించి ధర్మజుఁడు దుర్యోధనుతో జూదమాడఁబోయెను. ధర్మమార్గానువర్తియగు నాపాండవాగ్రజుఁడు శకుని పన్నిన వలలో చిక్కుకొని రాజ్యము సర్వస్వమేగాక, భార్యా సోదరసమేతముగ తాను కౌరవులకుదాసుఁడు కావలసివ చ్చెను, పాండవులనగౌరవింపదలఁచి దుర్యోధనుఁడు జూదమున దాస్యము నకు పాల్పడిన పాంచాలిని కురుసభకు తెప్పించెను. వృద్ధరాజున కీవార్త వినవచ్చినంత నే ఉపద్రవములు సంభవించునను భీతిచే పాండవులను దాస్యవిముక్తులుగఁజేయనాజ్ఞయిడి, ద్రౌపదికి కురు రాజ్యమం దగ్ధభాగ మొసంగెను, పాండవులు రాజ్యభోగము అనుభవించుటఁ జూచి దుర్యోధనుఁ డోర్వలేక ధర్మజుని మజుల జూదమునకు బిలిచి రాజ్యముంగోని పదమూడువత్స రములు రాజ్యభ్రష్టులైయుండ నియమించి వారిని పంపి వేసెను. మాయజేసి జూదమాడి వంచనచే నోడించి కౌరవులు పాండవుల రాజ్య భ్రష్టులఁ జేసియుడవులకుబంపెరని విని కృష్ణుం డున స్లావ్యం బుసకు బాంచాల యాదవ వృష్టిభోజాం కుకుకు కాదు లెల్ల వెంట రాఁజని, వారిదురవస్థఁగని పాండవయశోభివృద్ధికిఁ దా నొసర్చిన ప్రయత్నములెల్ల నిష్ప్రయోజనంబులగుటకు విచారించి దుర్యో ధనాదులయెడఁ గనలి తన వారికిట్ల నేను:
క|| “అవినీకుల -ఛ్బల: గౌ

రవ వ్యాసలఁజంపి ధర్మరాజునకుఁ కుగు ప్రవరున కొనఁని' యీ
యసనీ రాజ్యభిషేక మబిటీ క్తిన్.”
“అయ్యవసరంబున నేను మీయొద్దనుండమింజేసి యిట్టి మర్వ్యసనంబు సంభవించ,*ఏను సముద్రతీరంబున సాల్వుతోడ బదినెలలు యుద్ధంబునేసి వాని వధియించు పొంటె నక్కడ మసలితి” అని పాండవులనోదార్చి వారి బాలుర వెంటఁగొని ద్వారక కేతెంచెను. సత్యభామతోఁ బాండవులయొద్దకువచ్చిన శ్రీకృష్ణుఁడు యుధిష్ఠిరునకు ఆర్యానర్త సామ్రాజ్యాధిపత్యమిచ్చుటకు తన నిశ్చయ మిట్లఱింగించియే యుండెను; చ. "దమమును సత్యయుక్తి యును ధైర్యనిరూఢియు నిత్యతృప్తి యున్
శేమమును నీకు నైజములు సమ్మతి నర్థవశంబు గామ లో
భీములును బొంద పట్లగుటఁ బార్థివకుంజర ధర్మరాజునా
మమునఁ త్రిలోకపూజ్య మహిమం బొగడొందెన వెల్ల కాలమున్.
ఈ యంధకవృష్టిభోజకుకు రాన్వయభూపతు లెల్లరు నీ యిచ్చవచ్చినట్లు ప్రవర్తింతురు.” పాండవులంతటి పరమ యోగ్యులే వారి చెంత కృష్ణుండు లేకుండిన కాలమందు దుర్వ్యసనంబులకు బాల్పడు చుండిరి. ఆర్యావర్త రాజలోకం బానాఁడెట్టి నికృష్టదశయందుండెనో దీనినిబట్టి యెఱుంగనగును. శ్రీకృష్ణుండేగిన తరువాత అర్జనుఁడు శివునిగూర్చి తపం బాచరించి ఆతని మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రంబులఁ ఒడ సెను. ఇంద్రాది దేవతులుకూడ పాండవశిబిరంబున కేతెంచి తమకడనుండిన దివ్యాస్త్రంబుల నర్జునునకిచ్చివానిని దేవకార్యా ర్థమంపుమని ధర్మజు వేఁడిరి. అర్జనుఁడు దేవేంద్రు వెంటనేగి దానవ వీరులగు నివాతకవచులఁజంపి దేవతల ఋణముదీర్చివ చ్చెను. వనవాసంబుననున్న కాలమువృథపుచ్చక పాండవులు రానున్న మహాభారతయుద్ధమునకు కావలసిన సాధన సంపత్తి నార్జించు కొనుటకే ఉపయోగించుకొనిరి. తమ్ము పరిభవింప నే తెంచిన దుర్యోధనుఁడు గంధర్వప్రభునిచే గొంపోఁబడినప్పుడు ధర్మజుఁడు తమ్ములనంపి వాని విడిపించి పౌరవ్యుల గౌరవమునకు భంగ పాటొదవకుండ కాపాడెను బుద్ధిమంతులు కష్టములకు కృంగి కృశింపక, తమపురోభివృద్ధికి నద్ధానినొక సోపానముగ చేసుకొన బ్రయత్నింతురు.
"ధార్తరాష్ట్రుల చర్యకుఁ దలఁకకుండ
దారుణారణ్యవాసంబు మీరిఇచ్చి
పాండురాజ కుమారులు వఱలుచుండ్రి
అగ్ని సంతప్త కాంపినంబట్లు మిగుల॥" (ఆధునికము)
పాండవులు పదమూఁడగు నేటఁ దా మొనర్పవలసిన యజ్ఞాతవాసదీక్ష మత్స్యభూపతియగు విరటుపురంబున గడుప నిశ్చయించిరి. ద్రుపదుని తరువాత విరటుఁడే ఆర్యావర్తమం దధిక బలవంతుఁడు. తనకు సింహబలుని సహాయముండుట చే దుర్యోధనుని సైత వివిరటుఁడు లెక్క నేయకుండెను. తమ సత్ప్రవర్తనమువలన బాండవులు విరటుని యభిమానమార్షిం చిరి. కౌరవులు విరటు నగౌరవించుటకు సర్వసైన్యసమేతముగ నేతెంచి మత్స్యాధిపుని గోవులఁ గొంపోయినపుడు మారువేస ముననున్న అర్జునుఁడేగి కౌరవయోధుల పరిభవించి గోగణం బుల మఱల్చుకొనివచ్చి విరటుని కృతజ్ఞతకుఁబాత్రుఁడయ్యెను, అందుచే బాండవులను గుర్తెఱింగిన తరువాత విరటుఁడు తన కూఁతు నర్జునునకీయ సంకల్పించినట్లు తెలుప, అర్జునుఁ డా బాలికను అభిమన్యునకు భార్యగఁగైకొని, విరటుని ఆఫ్లై బంధునిగఁజేసుకొనెను. ఉత్తరవివాహమునకు పాండవపక్షమువారగు రాజు లందఱునువచ్చిరి. శ్రీకృష్ణుఁడును బలరామ సాత్యకినమేతముగా నచ్చోటికి విచ్చే సెను. ఆసభయందు కృష్ణుఁడు రాజలోకంబు నవలోకించి, తమకు పైతృకంబగునట్టిదియు, రాజసూయం బున నలవఱచికొన్నట్టిదియు, ధార్తరాష్ట్రులు వంచన మెయి గైకొన్నట్టిదియు నగు రాజ్యంబు పాండవులకు పునస్సంపాదన సేయు కార్యంబునఁదోడ్పడవ లెనని బోధించెను. విరాటద్రుపదులు తప్పక సాయపడుదుమని బాసయిచ్చిరి. కృష్ణుఁడుమాత్రము తా నెట్టిసహాయము చేయనుండెనో స్పష్టీకరింపలేదు— బల దేవుఁడు కౌరవపక్షపాతిగను, సాత్యకి పాండవపక్షపాతిగను ఉండుటచే శ్రీకృష్ణుఁడప్పటికిఁ దటస్థుఁడై యుండవలసివచ్చెను. మార్గమున సుభద్రను అర్జునుఁడు కొంపోయిన నాఁటనుండియు యాదవులకు పాండవులపై పగ మెండయ్యెను. అట్లగుట కృష్ణుఁడు బహిరంగముగ పాండవపక్ష మూనుటకు జంకుచుం డెను. ద్రుపద, విరాటుల సగ్రేసరులుగఁ జేసినచో వారెక్కుడు శ్రద్ధతో పాండవపక్షమూనిపోరుదురు. కృష్ణునకు యాదవులలో పలుకుబడియు గౌరవమును నానాఁటికి సన్నగిలుటనుగాబోలు, విధిలేకుండిన తుట్టతుదకు తనసహాయ్యము పాండవులు వేఁడు దురుగాక’ యని చెప్పి శ్రీకృష్ణుఁడన్న దమ్ములతో నటనుండి కడలి పోయెను. తమబలసంపత్తుల అభివృద్ధికిఁదోడ్పడని కార్యములయందు కృష్ణుఁడు జోక్యముకలిగించుకోనుటకు యాదవు లంతగ నిష్టపడ కుండిరి. తత్కారణమున శ్రీకృష్ణుని లోకహితైక కార్యములు కూడ వారల కంతగ రుచింపకుండెను. అంతకన్న సూదవుల దుశ్చేష్టలు కృష్ణునకు రుచింపకపోయి యుండును, చెట్టు సత్త్వముగ్రహించి ఔపథముగ రరుదు గదా ! పెరటి నుపయోగించువా"

మహాభారత యుద్ధము
(i) యుద్ధ ప్రయత్న ములు -

ఏనాఁడు పాండవేయులు విరటుపురంబున నుండినట్లు దుర్యోధనునకు స్పష్టపడియెనో ఆనాఁటినుండియునాతఁడు యుద్ధ సన్నద్ధుఁడు గాఁజొచ్చెను. యుధిష్ఠిరుఁడుకూడ, ద్రౌపదపురో హితుని దుర్యోధనుకడకు, రాజసూయయాగము నాఁటికి దమ కున్న రాజ్యభాగమియ్యవలసిన 'దనివర్తమానమంపియు, సైన్య ముల సమకూర్పప్రారంభించెను. దీనిఁబట్టి యిరువాగులవారును యుద్ధమునిశ్చయించుకొనినట్లు కాన్పించును. ఆర్యావర్తమందలి రాజుల సహాయముకోరి ఉభయపక్షములవారును దోడాస వడి దూతల సంపుకొనిరి. సకల రాజన్య సామాన్యంబుగా గోపాల దేవుపాలికి దూతం బుచ్చుట తగవుగాదని తలంచి సుయోధనుండు తానే స్వయముగ నాతనిపిలువసరిగెను. ధర్మజుఁడు అర్జును సంపెను. వారిరువురు నొకేసమయమున ద్వారక కేతెంచిరి. దుర్యోధనుఁడు కృష్ణుని దనకుసమానుఁడుగ భావించెను. ఆతనికడనుండిన పశుబ లమునాసించి, యుద్ధమునకాహ్వానింప నేతెంచెను. ఇంక నర్జునుఁ డన్ననో శ్రీకృష్ణుని బుద్ధియ తమ సమస్తపురుషార్థమ్ములకు మూలమ్ముగా భావించి యాతని భగవంతునిగా నెంచి పూజించు చుండెను. వీ రిరువుర మనోభావంబులఁ గుర్తెఱంగియే కృష్ణుఁడు తనకున్న పశుబలమును ఆత్మబలమును రెండుభాగములుగ నొనర్చెను. ఆభాగము లెవ్వియన:- వ్యాపారత మైనుండు నేనొక వైపునను, ఇంకొక వైపు:
"నాపాటియె పదివేవురు
గోపాలురు గలరు సమరికోవిద బాహా
టోపాభిరామమూర్తులు
చాపాద్యాయున కళావిశారదచిత్తులొ.” "ఊరక నిరాయుఢ
అని కృష్ణుఁడు పలికి, వారలతో ఎవరికి కావలసిన భాగమును వారు గైకొనుఁడని చెప్పెను. బలరామాదులకు శ్రీకృష్ణుఁడు పాండవపక్షపాతిగ కాన్పింపకుండుట కై కౌరవులకుకూడ కొంత బలమిచ్చి పంపెను. ఇదిగాక అపరిమితబలగర్వితులైయున్న యాదవులకడ తనమూలబలమగు నారాయణగోపాలు' రుం డిన తనయనంతరము యాదవులు లోకోత్పాతముల గలిగింతు ను భీతిచే తనమూలబలము కౌరవులకిచ్చి అద్దానిని అర్జునుచే నిర్మూలింపఁజేయ నిశ్చయించియుండనోపు, ఆత్మబలమధిక మైన శ్రీకృష్ణునకు పశుబలముపై విశ్వాసమంతరించుటచే నద్దాని నా సించిన దుర్యోధనునికిచ్చి, నిరాయుధవ్యాపారతనుండ నిశ్చ యించిన తాను రణంబునకు సహాయంబాల్లని అర్జును చెంత ఁ జేరెను. అర్జును కోర్కె దీర్చుటె తనవ్రతంబగుటను, దానిడిన భాగంబులలో, చిన్న వాఁడను మిష మీద అర్జును నే మొదటవం తెత్తుకొమ్మనెను, మహాబుద్ధిమంతుఁడయ్యును శ్రీకృష్ణుఁడు ప్రమాదమువలన ప్రళయము సంభవించునను భీతిచేశావలయు నేదో కారణము కల్పించి, అర్జునుడే మున్ముందు వంతు నెత్తుకొస వ లెనని సిద్ధాంతపఱచెను. శాపదగ్ధక్షత్రియవంశమగు యదువంశమున నుద్భవించిన వీరుఁ డగుటచే కాఁబోలు శ్రీకృష్ణుని సుయోధనుఁడు దనపక్షము నకు గైకొనుట కంతగ నాసింపలేదు. కృష్ణునియెడ నాతనికి భక్తి కన్న భయమెక్కుడుండెను. శల్యునితో:
క || సత్త్య సరస్వతి సగు మౌ,
చిత్త్య విశారదము నీదుచిత్తెము నియమౌ
దాత్త్యంబు మేఆయ నాకున
మాత్యుడవై పూని నèపు మత్త్సెన్యంబున్|
అని యాతనిఁ బ్రార్థించిన దుర్యోధనుఁడు, శ్రీకృష్ణునికడ నప్పు డిట్లనియె:
గయ్యమునే యువగన్ సహాయముం
గోరి భవత్సికాసమునకుం జనుదెంచితి
అనిమాత్రమే సెప్పెను.—దుర్యోధనుఁడు, శల్యునితో నీవు ప మ్యానముసేసి నాకిటు అమాత్యుఁడవైనపదంబు కంటె మే లై నుతికెక్కుకోర్కి యెటులారని చూచిననొండు గల్గునే !" అని పలికెను.
అట్లగుట దుర్యోధనునకు శల్యునిపైనున్న గౌరవమున సహస్రాంశ మైనను కృష్ణునియెడ లేనట్లు స్పష్టపడు. చున్నది ! "వివిధోపాయ పరాయణుండు, రిపునొక్వీర్యాపహారక్రి
ప్రవణోద్యోగుఁడం మంత్రరక్షణ కళాప్రావీణ్యగణ్యుండు వై
ర్యవిశేకాది గుణో త్తిరుం డఖిల విద్యాజాల సంవేది *
అని పెక్కురు పెద్దలచే కొనియాడఁబడిన శ్రీకృష్ణుని మాహాత్మ్యము గుర్తెఱుంగ లేని దుర్యోధనుని రారాజపదవి యందుంచినచో నార్యావర్తమునకు భావిభాగ్యము సమకూడు టెటుల? మానవకోటికి మంగళము చేకూర్పనవతరించిన మహా పురుషుఁడు, దుర్యోధనాది దుష్టచయము వారియాటల నార్యా వర్తమున సాగనిచ్చునా! దుర్యోధనుఁడు శిశుపాల నరక, జరాసంధ, కంసులంతటి …………… లోకకంటకుఁడు కాకుండినను, ఆతఁడురజోగుణ ప్రధానుఁడై సాత్వీ కులగు పాండవుల కెన్ని యో యపకృతులు. కావించుటచే శ్రీకృష్ణుఁడు, ఆసురవృత్తుల నడంచినటులనే, దుర్యోధనాది దుష్ట నృపులను లోకకల్యాణముకొఱకు నిర్మూలింప నిశ్చయించుకో నెను.

(ii) ద్రుపద పురోహిత దౌత్య ము

                           పాండవులకడనుండి కౌరవులకడ కిరువురును, కౌరవుల పాండవులయొద్ద కిరువురును దూతలుగ వచ్చిరి. వీరిని మనవా రిపుడు రాయబారులనియు వారొనర్చిన దౌత్యమును రాయ బారమనియు ననుచు, పెంచి పెద్దగ్రంధముల వ్రాయుచున్నారు. అందు మొదటివ్యక్తి దృపద పురోహితుఁడు. ఈతఁడు హస్తి నాపురమున కేగి పాండుభూపాలు ధరణీ భాగమంతయు పౌండ వులకీవలసినదని నుడివెను. దౌత్య మొనకింప బయనమై వెడలిన పాంచాలపురోహితుఁడు మగిడి రాకపూర్వమేపాండవులు ఆర్యో వర్తమునందలి సకలరాజన్యలకడకును తమదూతలనంపి " రాం బోవు కయ్యమునకు వారివారి సహాయ్యమపేక్షింప మొదలిడిరి. ప్రబలవిరోథియగు ద్రుపదునిపురోహితుఁడు దూతగ వచ్చుటచే కౌరవులలిగి యయ్యది కయ్యమునకు కాలుదువ్వుటగభావించిరి. అందుకుదోడుగ, ద్రుపదపురోహితుఁడు శ్రుతికిఁబరువంబైన' వాక్యముల నాధార్తరాష్ట్రుల వాడిపోసెను. ఇంతలో పాండవు లొసర్చుచుండిన సమరసన్నా హంబుల వార్తాహరులనుండి వినిష దుర్యోధనుండు పాండవులకు సూదిమొన మోపునంత నేలనైన నీయకుండుటకు నిశ్చయించుకోనెను.

(iii) - సంజయు - దౌత్యము -

భీమసేనాదులవలన తనపుత్రుల కృపాయముశంకించియు, సుయోధనుని సంకల్పము మరల్ప నసమర్థుండగుటను, ధృతరా ష్ట్రఁడు సంజయుని పాండవులకడకంపి వారల నెటులేనియుకోపోప శాంతులఁగావించి రణమునకు కాకుండఁ జేయ బ్రయత్నించెను. 'శుష్కప్రియములును, సూన్యహస్తములును' అగు సంజ యుని దీర్ఘ సంభాషణ విని ధర్మజుఁడు భీతినొంది కావలయు, తమకు ఇంద్రప్రస్థముగాని యింకే యూరుసుగాని యొసంగినఁ జాలునని యనఁబోయెను. అప్పట్టున నచ్చో విచ్చేసియున్న కృష్ణుఁడు ధర్మజుని చిత్తవృత్తి గ్రహించి పాండవుల బలసంపత్తిస్తి పొగడెను. యుధిష్ఠిరుఁడంతఁ గొంత శాంతచిత్తుఁడై కలతఁ దేరి దన రాజనీతి నైపుణ్యమంతయుఁ దెల్లమగునట్లు సంభాషింపుచు కౌరవసామ్రాజ్యమున కాయువుపట్టులుగ నుండిన కుశస్థలి, వృకస్థలి, మాకంది, వారణావతంబునుఇంకనైదవదిం కెందైనను సరియే, యీయవలసి యుండువని చెప్పెను- పాండవులు ప్రాణతుల్యముగ ప్రేమించిన ఇంద్రప్రస్థమును ఇప్పట్టన యుధిష్ఠిరుఁడు విడిచిపుచ్చుటచే తననిర్మోహత్వము వెల్లడించెను, అనుద్దిష్టముగనాతఁ డ్రాప్రదేశములన్హాపించియుండ లేదు. పౌం డ్రక వాసుదేవునితో శ్రీకృష్ణుఁడు పోరరేలించిన సందేఱింగి కర్ణుడుయాదవులనోడించి గైకొనినది కుశస్థలి. ఆనాఁడది కర్ణుని యనుభవముననుండెను. కుశస్థలికోల్పోవుట కృష్ణుని ప్రక్కలో బల్లెమట్లు మెలఁగుచుండెననియనఁదగి యేయున్నది. మాకందియు పాంచాలురపట్ల నట్టిదియే. ద్రుపదునోడించినప్పు డాతనివలన కౌరవులు నష్టపరిహారముగ పుచ్చుకొని ద్రోణునకిచ్చియుండినది మాకంది, వృకస్థలి, వారణావతములు పేర్కొనుటచే పాండ వులు తాముబడినబన్నములు అనగా, విషభోజనము; లా గృహదహనము మరువలేదని తెలియఁబఱచిన ట్లయ్యెను, ఇంక నైదవది ఎచ్చోటనుండినను సరే యనుటలో తమపడిన బన్నములు సర్వ దేశ విఖ్యాతములనికూడ సుద్దేశించి పలికె ననియననగును. తమపక్షమూని వచ్చిన యాదవులకును పాంచాలు రకును సంతోషము కలిగించుటయేగాక, తానడిగిన ప్రదేశముల నిచ్చినచో, నయ్యని కౌరవవీరులగు కర్ణ, ద్రోణ, కృపుల కెంత యో భేదము గలిగించి వారిని దుర్యోధనుపక్షము వీడ జేయునని ధర్మజుఁడుద్దేశించి యుండెను. ధర్మజు మతముబాగుగ గుర్తెఱిం గియే కానోపు శ్రీకృష్ణుఁడు పాండవదూతగ కౌరవసభ కేగినప్పు డన్నిటికన్న భేదోపాయంబునే యెక్కుడుగ నుప యోగించి కౌరవులలో కలతల జనింపఁజేసి మఱలివ చ్చెను. అడిగినదిమాత్ర మల్పమే. అర్ధరాజ్యమునకు బదులు మారుమూలలనుండిన ప్రదేశములతో రెను, కాని వానినొసంగ దుర్యోధనుఁడు సంసిద్ధు డైనపుడు కొంప లంటుకొనును. కౌరవ సామ్రాజ్యమున కలతలుజనించినంత సామ్రాజ్యము గుభిల్లునఁ గూలును-ఇంతకును, సంజయుఁ డెవరు? దూత. ఆతనిపలుకుల వలన కార్యము కాసంతయైనఁ జక్కఁబడలేదుగాని, కౌరవులకు క్రౌర్యముమాత్రము హెచ్చెను. శ్రీకృష్ణునకు కావలసినదిగూడ నింతియే !
కాని ధర్మజుఁడు శ్రీకృష్ణునితో చెప్పినట్లు:
క! మమ్మెఱుఁగు చెదిరి నెఱుఁగుదు,
నెమ్మియెఱుఁగు వర్థసిద్ధి జీ యెఱుఁగుదు, వా
క్యమ్ముల పద్ధతి నెఱుఁగుదు,
* * * ఇట్టిఁ డగుటనేగద యీ కార్యనిర్వహణార్థము గురుసభకు యుధిష్ఠిరుఁడు గృష్ణు

(iv) — శ్రీ కృష్ణుని దౌత్యము —

తరువాత శ్రీకృష్ణుఁడు పాండవుల రాయబారిగ కురు సభకేతించెను. దుర్యోధనాదులు తనమాట వినరని నిశ్చయ ముగఁ గృష్ణుఁడఱంగును వారినట్టి స్థితికిఁ దెచ్చిన పిమ్మట నే, తాను పాండవులపై నిందఁబావుటకు రాయబారము పేరిట హస్తినాపురమున కేతెంచెను-పాండవులకు మాత్రము ధర్మజుని మతము ననుసరించి, యుద్ధము చేయకుండగనే రాజ్యముపాలు రాఁబట్టుకొనవలెనను కోరికయుండెను. వారు మాత్సర్యము వీడి గతములను మరచిపో నిశ్చయించుకొనిరి. తే! “అలని యెఱుఁగక ధార్తరాష్ట్రులు గడంగి
మమ్ము బఱిచిన పాటులు మానసముఁ
చవుబఁబెట్టిన విత్తుల చందమొంది,
యంకురింపక చెడిపోయె సంబుజాక్ష .”

క! “కడపఁగ నొకళ్లు పసరము
నడిచిన నొక్కళులుఁ బెయ్య నడువవలయు నే
వెడుతెరు వాకౌరవ్యుల
కడనిలుంగాక మనకు: గ్రౌర్యంబేలా?”
అనుమతము ననుసరించి పాండునందను లుండిరి; కాని కృష్ణుఁడు మాత్రము, వృకోదగుండును, వివ్వచ్చుండును తోడు గాఁగ దురాత్ములగు గౌరవుల రూపుమాసి ఆర్యావర్తమునం తకు ధర్మజునిబట్టముగట్ట నిశ్చయించుకొనియుండెను. అందునకు జనవంద్యుఁడగు ధర్మసుతుని యాజ్ఞ అవసరము. (పాండవ కౌర వుల్ గలసి పాలును నీరునుబోలె నెమ్మిమైనుండఁ జూచిన ధర్మ జుఁడు కులక్షయకార్యమున కనుమతించునా? కాని కృష్ణుఁడు మాత్ర మెటులనైన రిపుక్షయంబుఁజేసి పాండు కుమారుల నార్యావర్తమున నధిక విభవోపేతులఁజేయ నిశ్చయించెను. రాజసూయమునాఁటి కార్యావర్తమున నిరంకుశుడుగ నుండిన జరాసంధుని సంహరించుటకు ధర్మజుని ఆజ్ఞపై భీమా ర్థునుల వెంటనిడుకొని వెడలెను. కాని నేఁడట్టి కార్యమునకు ధర్మజుఁడియ్యకొనవ లెనుగదా! ఆతఁడు" గులక్షయము కాకుండ కార్య మేవిని నెఁజక్కఁబడుట యెంతయు నొప్పు” నను సభి ప్రాయముతో నుండెను. కావున ధర్మనందనుని మనంబునిశ్చింతం బొనర్చుట కృష్ణునకు మొదటికర్తన్యమైయుండెను. శ్రీకృష్ణుఁడు పాండవపక్ష పాతిగనుక, — రాజు బెడిదం బులు వల్కిన నచ్చోతగవులు వచ్చు నని ధర్మజుఁ డెఱుంగును. కాని ముష్కర దుష్కర్ములగు కౌరవుల సభకు అసహాయ శూరుఁడగు శ్రీకృష్ణునికప్ప యింకొకనిని పంపుటకు ధర్మజుఁడు సాహసింపలేదు. ఆకారణముననే గద,
తే! "కుటిలమతు లని నీతులు క్రూరకర్ము
లట్టినీచుల కడకు ని న్ననుపఁజాల
నీవు సంకటపడియెడు దేనపదవి యైన నే నొల్ల నొంటి యందరుగు టుడుగు.” అని ధర్మజుండ నెను !
ధర్మజుని అనుమానము వాప కృష్ణుండు ధైర్యముగః —
ఏను నిక్క మ న నావటం గలండె రణ కేళికి మార్కొన నొక్కఁడేనియున్?”
అని పలికెనేగాని, పురుష ప్రయత్న ములందు మాత్ర మాతఁ డెట్టిలోపమును చేయలేదు. సాత్యకిని రామిచి, యిట్లు చెప్పెను: —
కం॥ "మనప్రజలోఁ గరిపురికిం
జనుదేరఁగవలయు వారి సరణతో
శనియేర్పడ నియమింపు, ప
యనమై యేతెమ్ము నీవు ... ..."
“ దుర్యోధనుండు దుష్టాత్మకుం డతండు మన్నించు మాసు సులునుం గుటిలబుద్ధులు గావునఁ జక్రగదాధ్యాయుధంబులు రథంబునం బెట్టింపవలయు”. కృష్ణుఁ డిట్లు సాత్యకికి గట్టడినేయుటయందే కౌరవులు కయ్యమునకుఁగాలు ద్రవ్వినచో తనకపుడు కావలసిన పరికరముల సంసిద్ధ మొనర్చుకొనియే కృష్ణుఁడు కరినగరమునకుపయసమయ్యె సని సుబోధక మగుచున్నది. ఇం దీతని దూరదృష్టి విశద మగుచున్నది కాదా ! విజ్ఞానవంతుఁడగు వీ.౫ ఁ డెవ్వండును శత్రు శిబిరంబునకు నిరాయుధుఁడై పోనోపఁడు, శ్రీ శివాజీఛత్రస్థితి బిజ్జాపూర్ నుండి తనపై కరుదెంచిన అఫ్జల్ ఖానని, సంధి కలిసికొన నేగినప్పుడు కవచము, ఖడ్గము, వ్యాఘ్రనఖముల నేమఱి యుండెనా? శ్రీకృష్ణుండు తానుతప్పక సంధికావించుకొని వత్తునని చెప్పలేదు. ‘రాజ్యము చవిగొన్న వారు పాలేల యిచ్చెద’, రని యాతఁడు ధర్మజునితో స్పష్టముగపలి కెను. అందుకుధర్మజుఁడు, “లోకంబెల్ల నేను బ్రకాశిత ధర్మస్థితి నున్నటుల నొప్పుకొనిన నుతియచాలు”న నెను కాని అజ్జనాదులుమాత్రము సంధియేల యగునంచున్ మున్ను కైపెక్కినట్టి తలంపు’ మాని సంధి కై బ్రయత్నింపుమని యాతని బ్రార్థింపకపోలేదు. కావున కృష్ణుఁడు తుదకు సంధికినో పెనంత పురుషు కార మొనర్చుట’ కంగీకరించి యు తన దౌత్యమువలనవచ్చు పర్యవసానమును ముందుగ నిట్లు చెప్పి పోయెను. —సుయోధనుఁడును ఆతనిమంత్రులును కుటిలమతులును, వినీతులును అటను సంధికార్య వచనములు చక్కవిననీరు; నాపలుకుల కాతఁడు తెఱంగు మాలి; మాటలాడును; మీ తొల్లింటి పాట్లునుం దలంచి ఆచ్చోవిచ్చేసియున్న యెల్ల వారును వారి నగర్తింతురు. కావు; సంధిసమకూడకున్న నీవులోకంబు మెప్పువడము నల్లొసర్చుటయైన నగుంగాక.
తే! "ఆసుయోధను ముక్కున నావి గలుగఁ
బుడమి నీ కీడుఁ గావునఁ బోర కలుగు;
నేను కయ్యపు శకునంబు లెన్ని యేనిఁ,
గంటి; నీ ఎనుత్సాహివి గాఁగవలదు. ”
కావున సంధిపొసంగకున్నను, 'నచ్చోటి యుత్సాహంబు చందంబును, నంద జేయంగల వారివర్తనంబులుఁ గొలందులు నెఱింగి నీకు విజయంబగు విధంబునం జనుదెంచెద.'. “శ్రీకృష్ణుం డిట్లనిన పిమ్మటనే గురుసభ కేతెంచె” ననుటచే శ్రీకృష్ణుఁడు రాయ బారిగ నరిగె ననుటకన్న, దౌత్య మొనరింప సరిగెననుటకన్న, పాండవగుప్తచారుఁడుగ నరిగె ననుటయే యుక్తతముమగ నుండు నేమో! కౌరవబలమునఁ గలతల గల్పించి, భేదనీతి నెఱసి కార్యము సాధించుటయే శ్రీకృష్ణుని సంకల్ప మనుట స్పస్టము. మహా పురుషులు సంకల్పించినఁజాలు, కార్యములు క్రమపరిణామమును బొందును. కృష్ణుఁడు కరినగరముఁ జేరునంతలో కౌరవులలో నంతఃకలహము లుద్భవి లైను. అతిలోభదూపితుఁడగు నావృద్ధరాజు అందఱను తన స్వభావమువంటి స్వభావముగలవారిగనే యెంచి, పాండవ దూతగ నేగుదెంచిన కృష్ణునకు వలయు వస్తువుల నెల్ల లంచముగ నిచ్చి, వానిని తమపక్షమువానిగఁ జేసికొనినచో తనకొడుకులకు పాండవులవలని భయములేకుండునని తలంచెను.
కం|| "మనయింట నురా"ను గృహ
మున మశాసను ని కేశము నెయ్యడి మా
అని చూడ్కి కింద వది యె
ల్లను గౌరప మొప్ప నీవలయు మన నఘా”
అని ధృతరాష్ట్రుం డము, కాని "పాండవులకు నేడుగడయా కృష్ణుం బట్టి బంధించిన తెక్కలువిఱిగిన పులుఁగులుంబోలె వారు (పాండవులు) నాకు విధేయులగుదురు”. అని సుయోధనుఁడు స్పష్టముగా పలికెను. కౌరవుల కేడుగడమైన గాంగేయుఁ డా పలుకులు విని, "ఆ మహాత్ము నెడ నపకారంబు విచారించిన దుష్టా త్ములు నష్టాత్ములగుదురు. దీనం జేటునచ్చు” ననుచు మొ గంబు గంటు పెట్టుకొని దిగ్గనలేచిపోయె. కృష్ణుఁడు కరిపురమున కాలిడకముందే కౌరవులలో నిట్టిభేదాభిప్రాయములు పుట్టినవి. ఇంకఁ గృష్ణుఁడెట్టి యేర్పాటులొనరించుకొని హస్తినా పురికరుదెంచెనో చూతము :- పూర్వము తమ యనుభవము నందుండిన కుశస్థలమునందు కొండొకతడవుండి, అచ్చోనుండిన యాదవుల మన్ననలంది, తమవాఁడైన కృతవర్మతో సవి శేష స్నేహంబు సేసి, మార్గమధ్యంబున మహర్షులం గలిసికొని కరిసగ రంబున కేతెంచెను. కురునృపుఁడంపిన కజ్జంబులును, బండ్లును పుచ్చుకొని, వానిననుభవించిన విధంబుసలిపి, యసుధన మొల్లక, ఎదురుగ నేతెంచిన విదురాది విశిష్టజనుల బుధుదృష్టిఁజూచి, పరిరంభసంభ'నసము లొన్స, రాజమందిరమునఁ గొండొక సేపు నిలిచి, విదుకు సదరబుగఁ జనెను. పుణ్యపరులు, దోడఁబుట్టువు, లాక్యులైన ఒక కే బాల్యమాదిగఁ గీడాచ రించిన కౌరవు లాపాండవులకుఁ | బాణమైన శ్రీకృష్ణుల కెగ్గు నేల తలుపరు? అందుచే తన్ను వైనతు ్యనిగ భావించి జించు విదురు నాతిథ మ్రగీకరించెను. విదురుఁడు దుర్యోధనా దుల దురుద్యోగంబు ఔఱింగిన వ్యాశగుట, బాండ నేయుల దెసం దనమైత్రి కతంబుసము, శ్రీకృష్ణునియెడ భక్తికారణమునను, అతని గౌరవసభకుఁ వలనని బోధించేను. కాని కృష్ణుఁడు తొల్లిధర్మజునితోఁ బలికిన తిన్నుననే, విజరుతోఁ గూప, 'నీ తలంచిన చందంబునఁ తులువలై వారుకలగం బాఱిన, నా ముం దర నిలువం జాలుగురే!' అని యతి ధైర్యముగఁ బలికెను. ఇట్టుల ననెనే గాని శ్రీకృష్ణునకు మనమున భయము లేక పోలేను. కంసుఁడు తనతండ్రికిఁ గావించినటులే, దుర్యోదనాదు లు దస్ను కురుసభయందు బంధింతురన్న భీతి కలిగియున్న టుల కాన్పించును. అందుచేత నే మఱుచటి దినమున నభ్యంతరు లైన బలుమానుసులను పొదివికొని, విదురు కరమును, తమ్ముచే యియు, చెరియొక హస్తంబుస బుట్టుకొని దుర్యోధనుఁడున్న కొలువు కూటమున కేగెను. ఆ సభయందు సాత్యకియు, గృత వర్మయు తన్నంటి యిరువంకలఁ గూమ్చండఁ బెట్టుకొనెను. అంతతో చాలక విదురుని తనకు వెనుక డెనసున్న యున్నత పీఠంబునఁ గరం బత్తమి' గూటుచుండ నియమించెను. ఇట్లు స్వపరిజన రత్, తుండ గుటండేసి కృష్ణం డించ ంలియు కొలిన కుమారులకు వెఱగొందక యహా నిర్లక్ష్యభామ గూరుచుండఁ గలిగెను.
నచ్చోం ఇంక శ్రీకృష్ణుని జాత్యవిధానం బతీయునము. కా వచ్చినపనిఁ జతులో పాలుం) సాధింప జూచెను. అందు ముఖ్య ముగ భేదోవాయమునే యెక్కుడుగ ప్రయోగించినట్లు కాన్పిం చును. కొరవకూటమున కలకలం బవింపఁక్తేయుటయే ఆతని ముఖ ్యద్దేశము. కురుసభలో నా ఁడు ప్రారంభమున సామముగ నిట్లు పలుకఁదొడగెను:
తే|| "వాండవులు తండ్రి సచ్చిన ప్రజలు వారి సిరన్ వ్రాసరి వైశ్ నడిగాఁగ;
సహ నిష్కాంకు దిగడునిఁ చనునె
వారమువంగ :షింపు గా మన;
ఆ|| "వారి తండ్రిపాలు వారికి నిచ్చి నీ
పాలు నీవు పుత్రపౌత్రఙయము ననుభవించి సుఖులకై యుండుఁ; డిది బధు మిత్రసుజన కోటి మెచ్చు తే ..
" ధృతరాష్ట్రుం డతిలో భదూషితుండుగుట కాటంగి ఆతఁ డాలసింపక దానమార్గమునకు తక్షణమే గడం7ను, 'ఇంద్రప్రస్థంబుననుండి పాండవాగ్రజుండు నికుఁబెంపును బేరును చేయంగో మహామానియగు దుర్యోధనుఁడు విధి చెయిదముల కెక్కుడు ప్రాముఖ్యత నిచ్చి మాట్లాడుటచే సంధికి సమ్మతించు నేమోయని కృష్ణునకు భీతిపుట్టినట్లు కాన్పించును. శాకున్న వెంటనే ఓదార్చునట్టియు, వాత పెట్టునట్టియు ప్రసంగము ప్రారంభించు టేల ? _________ పాండిత్య శౌర్యనిత్యులు, పాండుసుతులు; వారిఁ గూడి బ్రతుకుట తెఱఁగు; కాని శకుని కర్ణదః శ్శాసన దుర్మంత్రి తంబున కార్యతంత్రంబు కానేరదు. వీరెకాదు సురాసురులెత్తి వచ్చినను పాండవేయుల మార్కొనఁజాలరు. సవ్యసాచి కెదు రుగ నిలువఁజాలిన వీరుఁడుండిన కయ్యమునకు పూనుకొనుఁడు. లేకున్న రిత్తగ బహుజనక్షయము వలదు. అనిగదా యని యెను! ఎందుకీ ప్యువిఱుపు మాటలు? ఎట్టివాఁడై ననిట్టి పలుకు లకుఁగనలకుండునా? ఈమాటలు రజోగుణపూరితుఁడైన రాజ రాజు కోపానలంబన కింధనంబు లయ్యెను. ఆతఁడాదినుండియు తనకడనున్న కర్ణుఁడు అన్ని టనర్జునునకుసరియగునని నమ్మియుం ట, సవ్యసాచి నెదుర్కొనఁజాలిన వీరుని వెదకుకొన నక్కర లేకుండును, కావున వెంటనే దుర్యోధనుఁడు యుద్ధము సిద్ధ మొనర్చి ఖచితముగ నిట్లు పలికెను: 'ధర్మపుత్రుండు జూదరి యగుట భూమిని గోల్సోయె. మా యిరువురిలో నెవ్వరైన సంగ్రామమున జయంబు గొని రాజ్యముచేయుటయే "నేను నిశ్చయించితి?' అంతమాత్రమునకు.—శ్రీకృష్ణుండు వుండరీ కాక్షుఁడగు టెల్లబోయి, అరుణకమలాక్షుఁ డయ్యె - నట! శ్రీకృష్ణునకు కావలసినటులనే జరిగె'నే: కావున నాగ్రహమునకు కారణము కాన్పింపడు. కాని తానటుపిమ్మటనాడిన నానాప్రకార వచనం బులఁ కరుణకమలాక్షుఁడగుట యవసరమని ఆరీతి నభినయించి యుండనోపు, శ్రీకృష్ణుండాడిన యప్రస్తుత పరుపవచనంబులకుఁ గటకటంబడి దుర్యోధనుండటనుండి రాజసమున దగ్గన లేచిపో యెను. అతని వెనుక కర్ణుండు ననుజగణంబును వారిపొండైన జనపతులును బోయిరి. అంత కృష్ణుండు సందెఱింగి మిగిలిన సభాసదులం గాంచి యిట్లనియె. ఉ “కలనుఁడు నిట్ల తండ్రి మదిగంజడు చందమొనర్చి ధర్మ వి ధ్వంసము చేసినం గలమువారలు నా కెజిఁగింప* నేను దు ర్మాంసము గోయువైద్యుని క్రమంబున నాతని ద్రుంచి యన్వయో త్తంసముఁజేయనే జనకుఁ, తద్విన మొప్పది మీరుఁ జేసినన్" ఈ విప్లవప్రబోధము, పాండవులకు రాజ్యము రాఁబెట్టు మార్గము గాఁబోలు! భేదో పాయ ప్రయోగమున శ్రీకృష్ణుండద్వ తీయ కౌశలము కనపరచెను.— పాపము ధృతరాష్ట్రుఁడు కృష్ణుని పలుకుల కదరిపడి, మతిచెడి, మంతనంబునకు విదురుసంపి గాం ధారిం గొనివచ్చెను. ఆమె చెప్పినను దుర్యోధనుఁడు వినలేదు. అతఁడు కృష్ణుని కుతంత్రంబున కలిగికావలయు నాతనిఁబట్టి కట్ట సంసిద్ధఁడయ్యెను. కృతవర్మ -నింగాంచి యాదవబలములఁగొని వచ్చి సభాభవనమున శావల యుద్ధమునకు సిద్ధుఁడైయుండెను. సాత్యకియుఁదానొక్కండె లోపలికి నెల్లఁజాలుగు నని యెల్ల విధంబుల నప్రమత్తుడయి యుుడెము. శ్రీకృష్ణుండంతట దండో పాయముకూడ నవసరమైన నచ్చోప్రయోగింపఁగల సామర్థ్యము తనకున్నదని యంద ఱుుగునట్లు ధృతరాష్ట్రు నుద్ధేశించి యిట్లనియె:
ఉ! రోమము నాపయింగలిగె ళూంతఁ గౌరవు లింతనేఁలి సం
తోవమ; నీవు వ్రాభసముతోఁ గనాకు ననుజ నేనుజ్ఞ యెము, యిము ని
దోషత నేను నోపుగతి దోర్బల దుర్జయు లైనవారి వి
ద్వేషముఁ జక్కఁ జగతీ నిర! యంతిః పోయి వచ్చెదన్.
శిశుపాలుఁడు దు సుయోధనుఁడు! అనఁగలమాట యనెనేగాని కృష్ణునకు భీతిమాత్రముపోలేదు. సుయోధను బలసంపత్తుల బాగుగ నెఱుంగుట నటనున్న వారిని తనమాటలతో మైమ పింపఁ జేసిఅవ్వలి కేగనిశ్చయించెను, తనక ట్టెదుటనున్న యక్కురు పతి కుమారుఁ జక్కంజూచి, ఏనొక్కరుండ నని తలంచెదు. నాపార్శ్వంబుల నింద్రయమవరుణకు బేరు లుండుట ఎఱుగవు. నాకు బాసటయై యదువృష్టి భోజాంధక వీరులున్నారు. హల గాండీవ బాహులగు బలదేవార్డునుల బలంబెఱింగి వర్తింపుము, యుధిష్ఠిరభీమనకులసహదేవులు నావీఁపున నున్నారు. అనిఅట్టహాసంబుగనాడిన అగంభీరవచనంబులకు దుర్యోధనుండు కొంతవడి చేపలు దక్కి. యుండెను. ఆ సం చఱంగి కృష్ణుండు సన్నిహితులైన కృతవర్మకరంబును సాత్యకి హస్తంబును నవలు బించి, సభవీడి, చివ్వున నవ్వలికేగెను. తండ్రియగు వసుదేవునికన్న శ్రీకృష్ణుండు కడునేర్చరి. కంసుఁడు వసుదేవుంబట్టి చెఱఁబెట్టినట్లు దుర్యోధనుఁడు కృష్ణుని బట్టి బంధింపఁజూచెను. దుర్యోధనుని దురుద్యోగంబు శ్రీకృష్ణుం డు విదురువలన మున్ముందు వినియుండుటను కావలసిన సన్నా హంబు లొనర్చుకొని'యే కౌరవసభ కేతించెను. తనకు మూడ నున్న ముప్పు, మాటల చేతప్పకున్న చోనాతఁడు పోటునకుఁగూడ సన్నద్ధుఁడైయుండెను. శ్రీకృష్ణునిదూరదృష్టియు, మనో ధైర్యము ను, వాగ్దాంభీర్యమును నాతనినప్పట్టునఁ గాపాడినవి. 'శ్రీకృష్ణుని బుద్ధియ మాసమస్త పురుషార్థమ్ములకు మూలంబు' అని యు ధిష్ఠిరుఁడు విశ్వసించినటుల, కృష్ణుఁడు తనబుద్ధి చాతుర్యము చే కౌరవవీరుల మనంబులఁ గావలసినంత కలవరము జనింపఁ జేసి వచ్చెను. బాహ్లిక భీష్మ ద్రోణ కృప ప్రముఖ నిఖిల విశిష్ట జనంబులను పాండవపక్షపాతులుగ నొనర్చెను. దుర్యోధనుని ప్రాణమిత్రుఁడైన కర్ణునితో నాతఁడు పాండవాగ్రజుఁడని చెప్పి, అతని మనంబున పాండవులపై అభిమాన మంకురింపఁ జేసెను. అందుచే నాతఁడు మనఃపూర్వకముగఁ బాండవులఁ దెగ నేయుటకు వెనుదీయక తప్పదు. అంతకన్న పాండవుల కెక్కుడు ఉపకార మొనర్చుటకు కర్ణుని అంతరాత్మ యియ్యకొనకుండెను. ఆప్తుఁ డైన సుయోధనుని నాపత్సయమున వీడి చనుట కాతఁ డంగీక రింప లేదు, శ్రీకృష్ణునిమాటలవలన కౌరవులు తప్పక గెలుతు రన్న విశ్వాస మా వీరాధివీరుని బాసిపోయెను. క "అనుజులు ఋత్విజులుగ నీ
పనియిటు సేయు వని నీ వుపద్రష్టవుగా
విను కురుకుమార పస విశ
సనమున రణయజ్ఞ మరఁడు (కర్మజాఁడు) సమ్మతిఁ జేయ్”
ప్రబల విరోధియగు కర్ణుని నిర్వీర్యు నొనర్చుటకన్న పాం డవుల పురుషార్థమింకేమున్నది ?
అంతతో పోయెనా! శ్రీకృష్ణునిమాటలమాహాత్మ్యమిం కనుజూతుముగాక :_ఆతఁడు వెడలిన పిమ్మట భీష్ముఁడు కౌరవ వీరుల నిరుత్సాహులఁ జేయనెంచి, దుర్యోధనుఁ డతిరథుండనియు దుశ్శాసన శకునులు సమరధులనియు, కర్ణుం డర్ధరథుండనియు, నిరూపించుటచే, రాజరాజు సన్మానము నార్జించి విఱ్ఱవీఁగుచున్న కౌరవవీరులు,నిరుత్సాహు లైరి. యుద్ధప్రారంభ సమయ మాసన్న మైనది, ఒకరిచావున కింకొక రెదురుచూచుచుండిరి. అంతః కలహము లారంభమైన తరువాత నపజయమున కాలస్య మేల యుండును? భేదోపాయప్రయోగకుశలుండగు కృష్ణుని దౌత్య ఫలితము లివ్వి, ధర్మజునకు విజయంబగు విధం బంతకన్న వేతెయ్యది !

శ్రీ కృష్ణుఁడు — గీతలు
(i) — పార్థ సారధి —

ఆనాఁడ్రు:
కం. “దేవేంద్రుని ఖాండమును
బావకునకు నీటి నలంచి పార్ధుని రధికుం
గావించి సూతుఁడెయ్యెను
గోవిందుఁడు మఱఁదితోడి కూజీమి మెయ."
ఆ కూఱిమి నాటినుండియు నభివృద్ధిఁ జెంది, పాండవుల నేఁడు పౌర రాజ్యంబునకుఁ బట్టముగట్ట శ్రీకృష్ణుఁ బ్రోత్సహింప, నాతఁడు మరల పార్థుని రథికుం గావించి, దా సూతుఁడై కురు క్షేత్ర రణరంగమున దర్శనమిచ్చుచున్నాఁడు. శ్రీకృష్ణుని మాహాత్మ్య మంతయు మహాభారతయుద్ధ మందే చూపఁబడెను. భగవద్గీతలు, బాహ్లిక సోమదత్తుల మరణ ము, సైంధవవధ, అభిమన్యునిచావు, ఘటోత్కచునిమరణము, ద్రోణుని అస్త్రసన్యాసము, కర్ణునిఅంతము, హ్రదంబున డాగిన దుర్యోధనుఁ బిలిచి భీము చేచంపించుట, ఉత్తరాగర్భ సంరక్ష ణము నిట్టివన్నియు శ్రీకృష్ణుని ప్రసాదములే. కేవలము పగ్గముల చేఁబూని పార్థుని యశ్వంబుల నదల్చుట కతండుండ లేదు. పంచేం ద్రియంబులఁ బాలించు ప్రాణంబుపగిది పాండవు లొనర్పవలసిన అన్ని కార్యములను, పార్థురథమునొగల పైఁదానుండి శ్రీకృష్ణుఁడే నిశ్చయింపుచుండెను. నీతులు చెప్పుటకు, గోతులు త్రవ్వుటకు, నిందలు రాకుండ బంధునాశ మొనర్చుటకు, ధర్మజుఁ డాతని మాటపై నడచుచుండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణుఁ డర్జునునకు కా మించిన ధర్మోపదేశము ననుసరించియే ఆతినికి భగ వానుండను బిరుదము కూడ వచ్చినది. వర్గంబులఁజేఁగొని శ్వేతాశ్వంబుల నాల్గింటినడుపుచు నరునిరథంబుపైఁగూర్చొనిన శ్రీకృష్ణుఁడు దివ్య కళలతో వెలుగొందుచు భక్తాగ్రేసరులకన్నుల, కానాఁటికే కాదు, ఈనాఁటికిని, కాన్పించుచునేయున్నాడు. శరతల్పశాయి యైనభీష్ముఁడు శ్రీకృష్ణుని బ్రార్థించుచు పలికినపలుకులఁ బరిశీ లింతుముగాక !
కం|| " పన వారిఁ జంపఁజాలక
వెనుకకుఁబో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునిఐంద్యుని పావభక్తి మొనయున్ నాకున్ ”
ఉభయనేనా మధ్యంబున రథంబునిలుప శ్రీకృష్ణుని తత్తరించిన, యర్జునున కప్పట్టున ఘనమైన శంక లుత్పన్న మగుటయు, నాతఁడు గాండివము దిగవిడచి నిలువున నీరై నిలు చుటయు నేలకలిగెను? పడిన పాట్లఁదలంచి, దాయాదుల దునుమ నే తెంచినవానికి, పాపము, పరబలంబుల వీక్షించినంత ధర్మ సందేహము లుత్పన్న ములయ్యెను. బంధునాశము వంశక్షయము కలిగించు కార్యము చేయుటకు జంకుపొడముచున్న 'దనెను. అర్జు నున కప్పట్టున సందేహములెందుకు కలిగినను, అయ్యవి, శ్రీకృష్ణునకు తన మాహాత్మ్యము వెల్లడింప మంచిసమయము చేకూర్చెను. వెంటనే మొత్తలపైనున్న కృష్ణుఁడు పార్థుమో మున దృష్టినిలిప నరుని పుట్టు పూర్వోత్తరంబులఁ జెప్పి, 'జీవుని యొక్క అస్థిరతయు, ఆత్మయొక్క స్థిరతయుబోధించి, అర్జునుని సంశయములఁ బాష మొదలిడెను. “ఫలిత మపేక్షింపక కర్మల నాచరించుటయే మనవిధి; పుట్టిన వారందఱును గిట్టకమానరు. మనము కేవలము నిమిత్తమాత్రులము. కర్మల ననుసరించి కార్యములు జరుగుచుండును. నేను కర్త ననుకొనుటకన్న వెఱివేఱులేదు. ఈశ్వరుఁడే మనచే నన్ని కార్యము లాచరింపఁ జేయుచున్నాఁడు. కావలసినచో, కాలగతినొందిన వారి మరణం బునకు హేతుభూతులెవ్వరో వీక్షింపుము” అని శ్రీకృష్ణుఁడు తనమాటల చమత్కృతిచే నర్జనుని మనోవీథి ననేకాద్భుత దృశ్యముల నాట్యమాడించెను. తత్ క్షణమే ఆ యతిరథశే ష్ఠుఁడు సంశయదూరుఁడై శ్రీకృష్ణునకు సాష్టాంగ నమస్కారము సర్వజనులు వీక్షింప నాచరించి, కార్ముకం బుదుకొని కయ్యం బున కియ్యకొనెను, అస్త్రసన్యాస మొనర్చినవాని సాహనంబు నకు సంసిద్ధునొనర్చుట శ్రీకృష్ణుని విశ్వరూపప్రదర్శనా ప్రభావ మని చెప్పుదురు. యుద్ధారంభమున శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనమున కవసరములగు పరిస్థితులుండెను. శ్రీకృష్ణునియెడ నెక్కుడు గౌరవముండిన భీష్ముఁడు కౌరవసేవల కధిపతిగ నుండెను. ఇంక పాండవ సేనలన్ననో, కృష్ణుని ప్రాణమిత్రుఁడగు అర్జునుఁడే నిజ ముగ నడిపించుచుండెను. పరభూపాయువులెల్ల జూపులన శుంభత్కేళి వంచిం'చుట కింతకన్న తగిన సమయమెయ్యది? ఇరువాగుల నట్టి యభిమానవంతులుంచుటచే శ్రీకృష్ణుఁడు నిరాటంకముగ నుభయసేనామఢ్యంబున నిలిచి యంతనాటక మాడఁగలిగెను, ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా' కార్య మొనర్చ ఉచితజ్ఞుఁడు శ్రీకృష్ణుఁడనుటకు సందియములేదు, ఆనుషంగికముగా మరికొన్ని పరమప్రయోజనములుగూడ నాఁటి ప్రదర్శనమువలనసిద్ధిం చెను, పదునెనిమిది అక్షౌహిణులును బచు నెనమండ్రుమహారథికులును నున్న రణరంగమున, నతిరథ శ్రే ష్ఠుఁడైన అర్జునునిచేభగవంతుఁడుగ పూజింపఁబడుటచే శ్రీకృష్ణు నకు గౌరవమధికమయ్యెను ఆదృశ్యముమాత్రము పాండవయో ధులకు ధైర్యమును, కౌరవపక్షమూని వచ్చినవారి కధైర్యమును, ఏకకాలమున కలిగించి, పార్థురధంబు రణరంగమున నిరపాయ ముగ నెల్లయెడల విచ్చలవిడిగ విహరించుటకు వీ లిచ్చెను. యోధుల కెట్టులుండినను, రణ మొనర్ప నేతెంచిన జనసామా స్యమునకు మాత్రము శ్రీకృష్ణుండు భగవంతుండను భావ ముద్భవించుటచే వారు నరుని తేఱిపారఁజూడ వెఱచి రన సం డసంగత మేమున్నది ! శ్రీకృష్ణుఁడు తనజీవితమందు ప్రధానముగ ముమ్మారు విశ్వమాపము చూపినట్లు కాన్పించును. కన్నతల్లికి పురిటింట తనకున్న సృష్టి సామర్థ్యముఁ జూపి తరింపఁజేసెనట, కౌరవ సభయందు తన్ను కట్టవచ్చిన దుర్యోధనాదులకు దిగులు గొలుప తన వాసుదేవత్వము వ్యక్తపఱచెనట. కురుక్షేత్ర రణరంగమున నర్జునున కంకురించిన దిగులు వాప శ్రీకృష్ణుఁ డీశ్వరుని లయకాలరూపము నతిచమత్కారముగఁ జూపెను. శ్రీకృష్ణుఁడు తనవిశ్వరూపము నింకను మఱికొన్ని పట్టులఁ జూపినట్లు భాగవతమునఁగలదు. అభీరబాలుఁడగు యుద్ధవుఁడు బాల్యమున కృష్ణునిరూపము గాంచి ధ్యానించుచుండ శ్రీకృష్ణుఁ డచ్చోటు బాసిపోయెను. కాని యుద్ధవుఁడుమాత్రము శ్రీకృష్ణుని మనస్సునం దుంచుకొని ధ్యానించుటచే అతనికి, లేని కృష్ణుఁ దున్నటుల కాన్పించెను. యశోదకు కూడ కృష్ణుఁడు తనబొజ్జ యందు విశ్వమంతయు కలదని నోరుదెఱచి చూపి ఆమెవలన దెబ్బలు తప్పించుకొనెను, అక్రూరుఁడు నీటియందును, రథము నందును, శ్రీకృష్ణు నేకమూహూర్తమునఁగాంచి భక్తి పరవశుఁ డయ్యెను. కృష్ణుఁ డొక్కఁడయ్యును గోపికలకు అనేకులుగ తాన్పించెను. కంసునకుఁ గూడ అంత్యదశయం దన్ని చోటులఁ గాన్పించి నందురు. ద్రౌపదికి వస్త్రము లసంఖ్యాకము లగుట కూడ శ్రీకృష్ణుని మాహాత్మ్యమే యట! ఇంతవఱకును భీతిచేత కొందఱకు, ప్రేమచేత కొందఱకు, కృష్ణుఁడు భగవంతుఁ డను భావ ముద్భవించెను. కౌరవసభయందును, కురుక్షేత్ర రణ రంగమందును, శ్రీకృష్ణుని విశ్వరూపప్రదర్శనా విధానములఁ గాంచినారము. -ఇంకొక్క ఘట్టమందు మాత్రము శ్రీకృష్ణుఁడు నిర్యాణమునకు పూర్వము భిన్నమగు విశ్వరూపముఁజూ పెను, శ్రీకృష్ణుఁడు కౌరవులకుఁగావించిన అపకారమున కాగ్రహించిన ఉదంకుఁ డాతని శపింపఁ జూచెను. కాని కృష్ణుఁడు తనమాటల మాహాత్మ్యంబున నుదంకుని వశపఱచుకొనెనేగాని ఈయుదంకు నకు పూర్వప్రయుక్తంబులగు విశ్వరూపములలో నెద్దానినైనను జూపి నివ్వెఱపఱుపలేదు. అనువుగాని చోట నధికుఁడ ననుట శాతఁ డిచ్చగింపకుండెను కాబోలు! ఇఁకశ్రీకృష్ణుఁడు గీతలయందు బోధించినమకము పరిశోధింతము:

(ii) శ్రీ కృష్ణు ని మ త ము.

శ్రీకృష్ణుని మహాత్మ్యమంతయు నాతఁడుబోధించిన గీతల యం దేయున్నది. సృష్ట్యాదనుండియు మహాత్ముల నేకులుద్భవించి మానవసంఘమునుసనార్గమున నడుపయత్నించిరి, వారలమార్గ ములు వేజైనను గమ్యస్థానము మాత్రము వేఱుకాదు. శ్రీకృ ష్ణుని నాఁటికి ఆర్యావర్తమ”దు ముక్తిఁ బడయుట కనేకమా ర్గము లవలంబింపఁ బడుచుండెను, అందు భక్తి, యోగ, కర్మ, సాంఖ్యాది మార్గములు ముఖ్యములు. ఆర్యావర్తరాజకీయ నాట్యరంగమందుండిన వివిధ రాజ్యముల నంత మొందించి, ఒక్క మహాసామ్రాజ్యము పౌరవ్యుల యాజమాన్యమున నెలకొల్పినటులే, హిందూసంఘమందు వ్యవహరింపఁబడుచుం డిన వివిధమతముల మార్గముల నేక మొనర్చి ఒక్కమతముగ నొనర్ప యత్నించెను. సకలమానవులకును పనికివచ్చు మతము నెలకొల్ప యత్నించిన మహాత్ములలో శ్రీకృష్ణుఁడు మొదటి వాఁడని చెప్పక తప్పదు. — శ్రీకృష్ణుఁడు-అవ తారపురుషుఁడా, కాఁడా? —_అను సం శయ మనేకుల వేధించుచున్నది. అవతారపురుషుఁడనగా భగవ దంశ అధికముగ గలవ్యక్తి యని భావింపవలసియుండును. ప్రతి మానవునియందును ఈశ్వరాంశ యున్నది. కాని అయ్యది కొం వెక్కువగను, కొందఱియందు తక్కువగను, ఉడును. ఎవ్వరు తమయందున్న ఈశ్వరత్వమును గుర్తెఱింగి అభివృద్ధికావించుకొందురో వారుకాలక్రమమున సంపూర్ణమగు ఈశ్వరత్వమును పొందుదుకు, అట్లుకాక సాధారణ ప్రాపంచక విషయములందు నిమగ్నులై తమయందున్న ఈశ్వరాంశ గుర్తెఱుంగక ప్రవర్తించువారు కాలక్రమమున పశుప్రాయులై తమ మానవజన్మ వ్యర్థమొసర్చుకొందురు. శ్రీకృష్ణుఁడు తన స్వలాభమునకుగాక యాదవసంఘమునకును, తరువాత భారత వర్షమునకును, ఆపయి మానవజాతి మంగళము కొఱకును ఎట్లుత నజీవితము విని యోగించెనో వెనుకటి ప్రకరణములయందు చూచియున్నాము, ఇదిగాక కురుక్షేత్రరణరంగమున శ్రీకృష్ణుఁడు పగ్గములు చేఁబూని అర్జునునకు సారథ్య మొనర్చుతరి ఆవీరాధి వీరున కుపదేశించిన గీతలు శ్రీకృష్ణుని మహాత్మ్యమును వేనోళ్ళ చాటఁగలవు. అన్ని జాతులట్లు హిందూ సంఘము కూడ వివిధావస్థలు దాటివచ్చినది. మానవజాతి బాల్యదశయందు ఎవరికి వారే జీవించుటకు యత్నించుచుండిరి. ఆనాఁడు జన్మకు పరమావధి ఇంద్రియ సుఖములనుభవించి విజృంభించుటయే యని భావిచు చుండిరి. కాలక్రమమున వ్యక్తులు, యితరుల కొఱకు తాము జీవింపవలసిన ఆవశ్యకతను కనిపెట్టిరి. ఆనాఁటి స్వర్గసుఖములు కూడ ఇంద్రియానందమయములై యుండెను, తపోధనులు, మునులు, అధ్వరకర్తలు, దిగ్విజేతలుకూడ చచ్చిన తరువాత దేవేంద్రలోకమునకేగి రంభాసంభోగముపొంద నువ్విళులూరు చుండిరి. మానవశరీరముతో నున్నంత కాలమును మంచినడవడి పొందియుండు టెల్ల అప్సరసల ఆలింగనమున కేయనియనవలసిన దే కద! ఇట్టియూహలచే బాహుబలసంపన్నులును, అతిమేధావంతు లును, ఇతరులను హింస పెట్టక సన్మార్గమున నడచుచుండిరి. యమధర్మరా జిడనున్న కఠినశిక్షలు మనుజుల వెఱపించి మంచి మార్గమున నుంచుచుండెను, కాని మానవుడతలను పాపపుణ్యములక్రింద విభజించి నంతమాత్రమున మహాత్ములు కొందఱకు మనశ్శాంతి కలుగ కుండెను-చిత్రగుప్తుని చిత్థాయందు మన పేరుననున్న పాపపుణ్య ములు (జమాఖర్చులు) సరిపడినంతనే మనము మరల మానవ జన్మమెత్త వలసివచ్చును. కావున మఱి జన్మలేనివిధాన మె భ్యుది యని మహాబుద్ధిమంతు లాలోచింప మొదలిడిరి, అంతు లేని ఆనందమునకు వారాసించి తత్ప్రప్తికై ప్రయత్నింప మొద లిడిరి. ఆశ లడుగంటనంత కాల మానందము ననుభవింపఁజాల మని వారునిశ్చయించుకొనిరి. ఎట్టి యానందమునాశింపనివాఁడే బ్రహ్మానందముఁ బడయఁగలఁడు, అట్టివానికి సుఖదుఃఖములతో నెట్టి ప్రసక్తియు నుండదు. భౌతికదేహ బాధలు వాని చెంతఁ జేరి ఆత్మాభివృద్ధికి నెట్టియాటంకమును కలిగింపలేవు. సుఖాభి లాషము, దుఃఖభయము, మనలను మానవ సంఘమును మిత్ర శత్రుకోటిక్రింద విభజింపఁ జేయుచున్నది. మహాత్ములగు వారికి అందఱునొకటిగ కాన్పింతురు. అందఱును దమలో నున్నట్లును, తామందఱిలో నున్నట్లును వారు భావించుచుందురు. చావులేని అంతరాత్మ, నశింపనున్న దేహమును జయించినగదా అయ్యది అమరత్వ మొందుననదగును! 'అమరగీత' యని చెప్పఁబడు భగవద్గీతల సారమిదియే. ఇయ్యవి శ్రీకృష్ణుఁడు అర్జునునకు బోధించినట్లు చెప్పుదురు — భగవద్గీత యొక్కటి యే శ్రీకృష్ణుని మహాత్ముగ నొనర్చు టకుఁ జాలియున్నది. ఇయ్యది ప్రపంచముదలి పవిత్ర వేదాంత గ్రంధములలో నగ్ర స్థానమాక్రమించుచున్నది,గీతా గ్రంధమువదు నెనిమిది అధ్యాయ ములక్రింద విభజింపఁబడియున్నది. అందు మొదటి ఆజధ్యా యములును కర్మకాండ నభివర్ణించును, తఱువాత ఆఱధ్యా యములును భక్తిమార్గమును వ్యక్తీకరించును. శేషించిన ఆఱ ధ్యాయములయందును జ్ఞానమార్గము ప్రశంసింపఁబడినది. శ్రీకృష్ణుని యనంతరము వేయి సంవత్సరములకు అవతరించిన బుద్ధదేవుఁడు మొదటి ఆఆధ్యాయములనే ఆధారముగఁ జేసుకొనినట్లు కాన్పించును. ఈతఁడుముఖ్యముగా నిష్కామకర్మనే బోధించెను, బుద్ధ దేవుఁడు ధర్మమును పాటించి సంఘమును సేవించిన ప్రతిమనుజుఁడును నిర్వాణము వడయు' నని ప్రబోధించెను. తరువాత నే తెంచిన లోకరక్షకుఁడు, అనగా ఏసుక్రీస్తు, భక్తిమార్గమున కెక్కుడు ప్రాముఖ్యతనీయఁదొడఁగెను, తనమత మును వ్యాప్త మొందించుట కేసుదేవుఁడు సాత్విక మార్గమునే యవలంభించెను. ఆనాఁటికి బుద్ధదేవుని అహింసామత ప్రభావ మింకను ప్రజలహృదయముల వీడియుండ లేదు. ఇతఁడు 'భక్తిని ప్రధానము చేసుకొని సాధుక ర్మావలంబనమున ముక్తిఁగాంచ నగు' ననెను. మఱి ఐదువందల సంవత్సరముల కవతరించిన మహ మ్మద్ అను మతబోధకుఁడు ఏసు దేవుని మతమే పాటిం చినసు, క్షత్రియోచితములగు రాజసమార్గముల నద్దాని నన్ని యెడల వ్యాప్త మొందింప మొదలిడెను. కావున నేఁడు ప్రపం చమందెక్కుడు ప్రజలచే అవలంబింసఁబడుచున్న మూఁడు ముఖ్యమతములును, అనగా బౌద్ధ, క్రీస్తు, మహమ్మదీయ మత ములును, గీతాప్రయుక్త మతములే కాని వేఱు కొనటులఁ గాన్పించును. ఇంక హిందూమతమందు నానాఁటికిఁ బయలు వెడలిన త్రిమతములఁ బరిశోధింతము. అద్వైత మతస్థాపనాచార్యుఁడగు శ్రీశంకరుఁడు గీతలలో చివరనున్న ఆఱధ్యాయములనే ముఖ్య ముగాఁగైకొనేను, జ్ఞానమునకు ముఖ్యస్థాన మొసంగి, కర్మను, శక్తిని అద్దాని కుపాంగములుగనొనర్చెను. రామానుజుఁడు భక్తిని ప్రధానముచేసికొని, జ్ఞాన కన్మములకు తరువాత స్థాన మొసంగెను. దీనినే విశిష్టాద్వైత దీని యందురు. ద్వైతమత ప్రబోధకుఁడైన మధ్వాచార్యులు కర్మ సోపానములపై భక్తిమార్గ మలవఱచికొనినచో ముక్తి సంపా దిపనగు ననెను. ఇట్లు త్రిమతాచార్యులును భగవద్గీతల నే యాధారము చేసుకొని తమ తమ యభిమానమతముల వ్యాప్త వెలుదించిరి. అంతయేల? నిన్న మొన్న నన్ని మతముల నేక మొనర్చ నెత్నించిన బాలగంగాధరుఁడు, అర వింద యోగి, గాంధీమహాత్ముఁడుకూడ తమ ప్రబోధనలకు గీతలనే యాధార మొనర్చుకొనియున్నారు. శ్రీకృష్ణప్రోక్తము లగు గీతావచనములకు మించిన సుబోధనలు కాన్పింపవు, సర్వ మతసారమగునట్టి గ్రంథమువచించినవ్యక్తి ఎట్టిమహాపురుషుఁడో చదువరులే యూహింతురుగాక. ప్రస్తుతమున్న రూపమున గీతలు శ్రీకృష్ణుని నోటినుండి వెలువడకుండ నుండిన నుండు గాక, గాని యందలియభిప్రాయములుమాత్ర మాతని వనుటకు సందియ మణుమాత్ర మైనను లేదు. ప్రతివ్యక్తియు నొక్కొక్క సమయమున అనుకొన నంతటి అత్యున్నతస్థితి కరిగి అద్భుతకార్యము లాచరించుచుం డును. ఆశ క్తియుక్తులు వ్యక్తుల నావరించియున్న అనుకూల పరి స్థితులననుసరించి యావిర్భవించును. వెట్టివారు, దయ్యముపట్టిన వారు నిద్రోన్మత్తులు కొన్ని నమ్మరాని పనులాచరించుచుందురు, అటులే శ్రీకృష్ణునకు కురుక్షేత్రరణరం గమున దేవుఁడు పూనియుండనోపు, కాకున్న అర్జునుడు మరల సావకాశముగ గీతల తెలుసుకొనగోరి శ్రీకృష్ణునడిగిన పుడు ఆతఁడు అసలుగీతల చెప్పలేక అనుగీతల నుడువుట ఎందుకు తటస్థించును! కావున శ్రీకృష్ణున కెక్కుడు భగవదంశ గీతలు సుడివినప్పుడే పొడమినట్లు కాన్పించును.

ని ర్యాణ ము

కురుపాండవ యుద్ధానం గము శ్రీకృష్ణుఁడు ధర్మజు నార్యా వర్తంబన శభిషిక్తుంగావింక కఁడు పూజ్యంబగు రాజ్యంబు నేయు, వెదికస్థాృద్ధిని గృహస్థధర్మము పాటించుచుండెను. దేశము నట్టు శించిన పుడికించిన శిశు బాలహంతకులును, కంస స్త్రీలోలురును, భైరవీ పూజాధురంధరులును, అగు నరక జరాసంధాది క్రూరవీరులందఱును సమసియుండుటను, దేశమెల్లఁ జల్లగ కాలము గడుపుచుండెను. అన్యపరిభవ మెఱుంగని యదువీరులు ద్వారకా నగర మున మిన్ను మన్నులుగానక మిడిసిపాటునఁ ద్రుళ్లుచుండిరి. శ్రీకృష్ణునిజూడ నరుదెంచిన మునిపుంగవులతో వారు పరిహా సోక్తు లాడ మొదలిడిరి. వా రలిగి “మీ రంతఃకలహములచే హతులగుదు' రని శపించిరి. యతినిందాపరతను యదువంశము నాశనం బగునని శ్రీకృష్ణుఁడు నిశ్చయించి యాదవులను ప్రభాతతీర్థంబున కరుగుం డని యానతిచ్చెను. కాని యాదవులు మదిపానమత్తులై మత్సరంబునఁ దమలోఁ దాము పోర నారంభించి యందఱును మా సిసిరి. బలరామకృష్ణులు చింతా క్రాంతమనస్కులై ద్వారక వీడి వచ్చేరి. యోధుండగు బలరాముండట్టిదుస్థితి నున్న దేశం బున నుడనొల్లక యోగమార్గంబున దేహంబు విడిచి చ నెను, హల రాముఁడే సరియైన యాదవవీరుఁడు. బ్రతికియున్నంత కాల మాతఁడొకరి లక్ష్యము లేక విచ్చలవిడి విహరించి, బ్రతుకు భార మని తోచినంతనే యద్దాని దృణప్రాయముగ విసర్జిం చెను. "హలధరున కుండవలసిన అమాయకత్వమంతయు నాతనిఁ.... యే మూర్తీభవించి యుండెను. శ్రీకృష్ణుఁడన్ననో టుకోడు యాదవుఁడు మాధవుఁ డై అవతారంబుల నెత్తయత్నించుటచే నాతనికి బ్రదుకు పై నాస యధికమయ్యెను. ఇది యాతని చరమకాలావస్థను బరిశీ లించినచో సువ్యక్తమగును. —శ్రీకృష్ణుండు చని చని, యొక్క నికుంజ పుంజంబు చాటున విశ్రమించుటం జేసి చరణంబు వేరొక చర ణంబుమీద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున, నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగావచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబుచాటున నప్పరమ పురుషుని చరణకమలంబు హరికర్ణంబు గాఁబోలునని దానింగని, శరంబు శరాసనంబునందు సంధానంబుసేసి, యేసిన, నతండు హా హా రవంబునం గదల మొదలిడెను,________ “కంసాది కుమతుల కసిమసంగినవాఁడు” ఒక్క లుబ్ధకుని చే కాలగతి నొందవలసి వచ్చెను! ఔరా, కాలమహిమ! అవసరముతీరిన పిదప అవతారపురుషులగతి యి ట్లేయుండును. మానవశరీరము ధరించియుండుటను గావలయు శ్రీకృష్ణ భగ వానుఁడుకూడ, 'బా'ణనిహతుం డైనయపుడు బావ్పంబులు విడు చుటయు, ఆహారావంబులో నర్చుటయుజరిగెను. కాని దెబ్బలిని నప్పుడుకన్న నుసుఱులు వీడునప్పు జాతఁడెక్కుడు సహ!) చూపెను, మహాపరాధుండగు నా లుబ్ధకుండు బామృజుల సిక్తవదనుం డై' కృష్ణుకడ కేతెంచిన నాతఁడు వానింగని తక్షమించి ప్రాణంబుల విసర్జించెను. ఇంకను ఈతనికి ఇహలోక తాపత్రయ మడంగ లేదు. -స్త్రీ బాలవృద్ధ జనంబుల గరిపురంబునకుం గొనిపొ’ మ్మని వాపుకునితోఁ జెప్పెనట! కాని యింతలో ద్వారకా నగరంబు పరిపూర్ణ జలమయంపై మునింగెను.
కం॥ "ఏ దినమున వై కుంటఁడు
మేదిని పైఁ గాల్చినట్టి మేను విడిచి నా
డాదినమున సశుభప్రతి
పాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యె౯ ||" శ్రీకృష్ణుండు తనకున్న శక్తిసామర్థ్యంబుల నెల్ల విని యోగించి కలియుగంబు రాకుండ కాపాడి యుంచెను. ఫణుల వర్తకవ్యాపారముల చేతను, (కాల) యవనుల దాడులవలనను, భరతవర్షమం దనేక నూతనాచార వ్యవహారములు చొరఁ చొచ్చెను. అందుచే ఆర్షమతమునకు విఘాతముకలుగనుండెను. కాని శ్రీకృష్ణునివంటి మహాపురుషుఁడు భూతభవిష్యద్వర్త మానముల బాగుఁగ గుర్తించి, వైదికాచారములఁ జాలవఱకు *రోచితముగ సంస్కరించి ప్రజలచే పాటింపఁజేసెను. ద్వాప యుగాకమునను, కలియుగారంభమునను, ఉన్న మహాత్ముఁ డగుటచే, మత సాంఘిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలయందు భావి కలియుగమున భారతవర్ష మింకొక జాతికి దాస్య మొనర్చు నవ సరము గలుగకుండ కట్టుబాటులొనర్చియే చనెను. కావున శ్రీకృష్ణుఁడు నూతనయుగకర్త యని చెప్పనగును. ఈతఁడన్ని విధములఁ గలియుగమునకు కావలసినట్టి అవతారపురుషుఁడే. కలియుగ మితని నిర్యాణానంతరము ప్రారంభమయ్యే సనుటలో నర్థమింతియే, ముందుప్రకరణమున శ్రీకృష్ణుఁడు కలియుగమునకు కా వలసిన సంస్కారముల నెటుల నడపించి, ఆయుగమువారి కవతార పురుషుఁ డెట్లయ్యెనో చూచెదముగాక,

ఉప సంహార ము
శ్రీ కృష్ణుఁ డు
(i) - యు గ కర్త

భారతవర్షమున పెక్కుమార్పులుగలుగు కాలమున శ్రీకృష్ణుఁ డెను. ఈతఁడు నూతనయుగకర్త కావుననే యీతని నిర్యాణానంతరము కలియుగము ప్రారంభ మైనట్లు మనవారు చెప్పుదురు. ఇంద్రియానందమే ప్రధానోద్దేశముగఁ గల అసురసిద్ధాంతములను శ్రీకృష్ణుఁడు నాశన మొనర్చెను. ఆర్యు లభివృద్ధిఁ జెందుచుండు సమయమున నష్టదిక్కుల కధి కారులుగ నియమింపఁబడిన నాయకులు (దిక్పాలకులు), వారి అనుచరులు (దేవతలు), కూడ నిర్వీర్యులై పేరునకుమాత్ర మక్కడక్కడ మిగిలియుండిరి. వారిలో నధిక బలవంతులైన ఇంద్ర వరుణ దేవపదవులం దుండువారు శ్రీకృష్ణునిచే నోడింపు బడిరి. అనగా నాటుమార్గముల కధిపతియైన ఇంద్రుఁడును, నీటిమార్గముల కథిపతియైన వరుణుఁడును యాదవవీరుఁ డైన కృష్ణునకు దాసులైరి. దేవతలక సాధ్యులైన దనుజులను (నరక, నివాతకవచులను) నరులయం దుద్భవించిన కృష్ణార్జునులు సంహరించి, సురులకు నరు లేవిధమునను అల్వలుకా రని స్థిర పఱచిరి. అర్జునుఁడు దేవేంద్రునితో సమానముగా నాతని ఆర్ధాసనముపైఁ గూరుచుండెను. ఆనాఁటితో సురసర భేదము లంతరించినవనుట కింతకన్న ప్రబలనిదర్శనము లేమికావలయు? సరనాయకులలోకూడ శ్రీకృష్ణుఁడు పెక్కుమార్పులఁ గావించెను. సనాతన ఆర్యకుటుంబములవారు మిశ్రమజాతుల ననాదరణదృష్టితోఁ జూచుచుండుటచే నార్యావర్తమున నైక మత్య మంతరించి యుండెను. ఆర్యావర్తాంతర భూములయం దుండిన ద్రవిడజాతులు ఆర్యసంప్రదాయముల నవలంబించి నను, వారి నార్యనాయకులు తమలోఁ జేర్చుకొనుటకు సందేహించుచుండిరి. అందుచే ప్రాద్దక్షిణభాగములయందుండిన అసురవీరులు ద్రవిడుల తమపడు మునకుఁ త్రిప్పుకొని వైదికమత వ్యాప్తికి విఘాతము గలిగించుటేగాక, ఆర్యావర్తమును కూడ నాక్రమింప మొదలిడిరి. కావున ననేక సనాతన ఆర్య రాజకుటుంబములవారు వృష్ఠినాయకుఁడగు వసుదేవుని తో వైవాహిక సంబంధములఁ గల్పించుకొని, జరాసంధాది అసురపక్ష పాతుల వాతఁ బడకుండ తమతమ రాజ్యములఁ గాపాడుకొనుచుండిరి. అవసరము ననుసరించి ఆర్యులు అభీరులను, యాదవజాతులనుకూడ తమలోఁ గలుపుకొనవలసి వచ్చెను. సదవాభివృద్ధికి ఆర్యులతో మైత్రియే శ్రేయో దాయకమని శ్రీకృష్ణుఁడుకూడ తండ్రిమార్గము ననుసరించి యసురసంహరణమునకును, అసురసంప్రదాయ నిమ్మాలమున కును, బద్ధకంకణుఁ డయ్యెను. తండ్రిపలె 'డొంకతిరుగుడు' మార్గముల నవలంబింపక ప్రత్యక్షవిరోధమూని శ్రీకృష్ణుఁడు కార్యము సాధింప ప్రారంభించెను. పాశ్చాత్య దేశములతోడి వర్తకము తమసొత్తనిభావించు చుండిన పణుల పసఁదూల్చి, శ్రీకృష్ణుఁ డావర్తక మాభీరుల కందఁజేసెను. వరుణ దేవుఁ డోడిననాఁటినుండియు పణుల కార్యావర్తమున పలుకుబడితగ్గెను. ఈవణిగ్జాతులు పాశ్చాత్య ఖండముల యందే నిలచియుండి అచ్చో ప్రత్యేక సామ్రాజ్య ముల నెలకొల్పి అభివృద్ధిఁగాంచిరి.* భారతవర్షమందుండిన వణిజులు దక్షిణాపథమున కేతెంచి, అచ్చోనుండిన సనాతన ఆదిమజాతులతో వైవాహిక సంబంధంబులు గల్పించుకొని యభివృద్ధిఁగాంచఁ దొడంగిరి. ఈ సంబంధములవలననే కరణు లుద్భవించి, పన్నాటముగనుండిన దక్షిణాపథమును కాలక్రమ మున కన్నాట మొనర్చిరి. పణులను పారఁద్రోలి' పశ్చిమోదధీతీరంబుల నాక్రమిం చిన అభీరులు క్రమముగ కుశద్వీపమంతయు స్వాధీనమొ నర్చుకొనిరి. అందు చేత నే యాద్వీపమునకు అభీరక (Africa) మనుపేరు వచ్చినది. శ్రీకృష్ణుని నిర్యాణానంతర మార్యా వర్తమున యాదవు లదృశ్యులైరి; కాని అభీరులుమాత్రము వివిధస్థలములనిలచి యభివృద్ధిఁగాంచినట్లు స్పష్టముగఁ గాన్పిం చును. గుప్తులనాయకులు (Egypt the land of Copts) కూడ గొల్లరాజు లేలినట్లు చరిత్ర చెప్పుచున్నది. ద్వారక అదృశ్యమైన తరువాత సౌరసేనము (Arabia) అభీరులకు ముఖ్యస్థానమయ్యెను. ప్రాచీన పాశ్చాత్య చరిత్రలయందు కాన్పించు హీబ్రూలు (Hebrews) మన శ్రీకృష్ణుని ఆద రణక్రింద నభివృద్ధిఁగాంచిన అభీరులే యనుటకు సందియము లేదు. శ్రీకృష్ణుం డార్యులకుంగల యహంభావమడంచి వైదిక కర్మల నందఱిచేఁ జేయింపసాగెను దీర్ఘతమసుండను అంధక ఋషిని దమలో నుండనీయక గంగాజలంబులఁ బడద్రోసిన ఆర్యులు, ద్వాపరాంతమున శ్రీకృష్ణుని మహాత్మునిగ నంగీక " మునులునృపులు: జూడ మును ధర్మజుని సభా మందిరమున యాగ మండప చూనఁ చిత్రమహిమతోడఁ జెలువొంది, శ్రీకృష్ణుఁడు అచ్చో నగ్రతాంబూలముఁ గైకొనెను, తాము తప్ప యితరు లాచరింపకూడదని ఆర్యులు వారించు వైదిక యజ్ఞములు, శ్రీకృష్ణుడు తనతండ్రియగు వసుదేవునిచేఁ జేయిం చెను,
తే!! "మఱిచి యజ్ఞాన “కామ్యకర్మములఁ దిరుగు వేద నా తురులకుఁ తన్ని వృత్తిఁజేయ
నుదయించి తండ్రునిన్ గొందఱం * వైదికకర్మ లాచరింప నర్హులమని గర్వించుచుండిన బ్రాహ్మణులు తమ వనితలు శ్రీకృష్ణుని సందర్శించి, భక్తిమార్గ మవలంబించి యానందపరవశు లగుటఁ గాంచి చిన్నఁబోయిరి. అందుచే వారు కర్మమార్గముకన్న భక్తి మార్గమే మనసున కెక్కుడు శాంతిఁజేకూర్చు నని తెలుసు కొనఁగలిగిరి. శ్రీకృష్ణుఁడర్థములేని యాగము లాచరించుట కన్న మానవసంఘమును నేవించుటచే మనసున కెక్కుడానం దమును శాంతియుఁజేకూరునని బోధించెను, నాఁటినుండియే భక్తిప్రధానమైన భాగవతమతమున కార్యావర్తమున నెక్కుడు ప్రాముఖ్యత వచ్చెను. కర్మమార్గము వెనుకఁబడుటచే బ్రాహ్మణుల ప్రాముఖ్య తయు, అహంభావమును అంతరించెను; అన్ని తరగతులవారికి నార్హమతముపై నభిమానము హెచ్చెను. అందుచే హిందూ సంఘమునకు నాఁటినుండియు నెక్కు ఔన్నత్యము గలిగెను.

శ్రీ కృష్ణుఁడు
(ii) - మహా త్త్వుఁడు

ఉ॥ "ఉత్తమకీర్తులైన మను జోత్తము లాత్మ హితంబు లెన్నడుం
జిత్తములందుఁ గోరరు హసించియు లోకుల కెల్ల నర్థ సం
పత్తియు భూతియు౯ సుఖము భద్రముఁ గోరుదురు
ఉద్దేశము లెట్టులున్నను ఫలములఁబట్టి వ్యక్తులు ప్రఖ్యాతిఁ గాంచుచుందురు. వృష్ఠివంశీయుఁడైన కృష్ణుఁడు తన తండ్రివిరో ధుల నిర్జింప మొదలు పెట్టి, మహాబలశాలియగు మాగధునితో కయ్యమునకుంగడంగి, ఆతనితోఁబోరలేక అభీరుల (నారాయణ గోపాలుర) తన చెంతఁ జేర్చుకొని అఖిలయాదవలోకము నేక మొ సర్పనెత్నించి, కయ్యము లధికమైనకొలంది నెయ్యములం బెంచి, భారతవర్షమందలి రాజకుటుంబములతో సంబంధములుకల్పించు కొననవసరపడి, తుదకు మహాభారత రాజకీయనాట్యరంగమునఁ గూడ ననవసరిసంపర్కము కలిగించుకొని, అనుకొనని జగ త్కల్యాణకర్త కావలసివచ్చెను. కాని తనవిహితధర్మము లెఱింగిన కొలందిని తదను గుణమగు శక్తియుక్తులతో వాటిని సమర్థింప సాహసించిన వ్యక్తి మహాపురుషుఁ డనక తప్పదు. శ్రీకృష్ణుఁడు కేవల స్వార్థపరుండుగాక యింకొకరిఁగూర్చి పాటుపడుటచే మహా త్ముఁడుకూడ సయ్యెను. బలదేవుఁదు తనకుఁగల ప్రఖ్యాతి నంతయు తన పశుబలముతోడనే యార్జించియుండెను. అందు చేతనే పశుబలప్రియుఁడగు దుర్యోధనుఁడు హలరాముని ప్రియశిష్యుఁడని చెప్పఁబడుచున్నాఁడు. శ్రీకృష్ణుఁ డట్లుగాక బుద్ధిబలముచేత సాధారణముగ నన్ని కార్యములను సాధింపఁ జూచుచుండెను. కావుననేకావలయు మనవారు శ్రీకృష్ణుఁడు మూర్తీభవించినబుద్ధి అనికూడ వాడుదురు. * కేవలముబుద్ధి ప్రభావము చేత నే వేలకొలఁది వత్సరముల పిమ్మటఁ దనజన్మభూమికిని, అభిమానమతమగు నార్హమతము నకును రాఁగల ముప్పుల నెఱంగి, కావలసిన కట్టుబాటు లొనర్చియె చనియెను. వివిధజాతులవా రేతెంచి ఆర్యావర్త పుణ్యభూమి నల్లకల్లోల మొనర్చి ఆర్షమతమునకు విఘాతము కలియుగంబున గలిగింప యత్నింతు రని శ్రీకృష్ణుఁ డెఱింగి యుండుట చేత నే సర్వమతములకును సమాధాన మియ్యఁగల గ్రంథమును కూడ నుడివి చనెను. మాటలతో మార్గము సూచించు మహాత్ముఁడే గాక, నడవడిచేత కూడ సందఱకు నాదర్శప్రాయుఁడై అస్తమించిన మహాపురుషుఁడు శ్రీకృష్ణుఁడు. శ్రీకృష్ణుఁడు తనబద్ధిచేత నే కదా పూతనాది రాక్షసుల నంత మొంcం చెను. ఆసన్న మరణభీతిచే మతి చెడియున్న కంసుని కీలెఱఁగి అతనిఁ గాలువీఁటి కంపెను. అబలను ఆహవ మునకు నెదురుగ నిలువఁబెట్టి, నరకుని మదికలఁగఁజేసి, ఆతనిఁ గడతేర్చెను. కాలయవనుని కాల్నడకను ఏకాకిగ మధుర నుండి ముచికుందుఁ డుండిన బిలముకడకు కొనివచ్చిన దేది ? శ్రీకృష్ణుని బుద్ధిబలమేకదా! మార్గాయాసమున మ్రగ్గియున్న యాతనిని, నిలుకడగ నింటకూర్చొనియున్న ముచికుందునిచే నంత మొందించెను. భీమునిచే జరాసంధుని మ్రందించుట యందు శ్రీకృష్ణునిచమత్కారమెంతయుఁగాన్పించును. కౌరవా ధీశునికారాగారమున తా బంధీకృతుఁడుగాకుండ, తన వాజ్నై పుణిఁజూపి, యటనుండి దాటుకొనివచ్చినవ్యక్తి బుద్ధివిభవమున కేమనవ లెను ! యుద్ధదినములలో భీష్మునికడకు ధర్మజునంపి, ఆ వీరాధివీరుని మరణ మర్మమెఱుంగుటయు, అశ్వత్థామ హతుఁ డయ్యెనని ధర్మజు చేఁబలికించి ద్రోణునిచే నస్త్రసన్యాసము చే యించుటయు, నిట్ల నేకకృత్యంబుల శ్రీకృష్ణునిబుద్ధికాదే పాండ వే యుల పురుషార్థంబులకు మూలంబయ్యెను. యాదవులు శాపోప హతులైనప్పుడు శ్రీకృష్ణుఁ డసమర్థతచే నూరకుండ లేదు. వ్యసనాసక్తులై లోకకంటకులుగ నుండిన యాదవుల వినాశన మపేక్షించియే అతఁ డుపేక్షించి యుండెను.
"సీ. ఈరీతి శ్రీకృష్ణుఁ డేపారఁ బూతనా
శకట తృణావర్త సాల్వ వత్స
చాణూర ముష్టిక ధేను ప్రలంబక
చైత్యాఘ శిశుపాల దంతవక్త్ర
కంస పౌండ్రాదిక ఖండనం బొనరించి
యటమీదఁ గురుబలంబణఁచి మఱియు
ధర్మజు నభిషిక్తుఁ దనరఁగాఁ జేసిన
నతఁడు భూపాలం బమరఁజేసె;
తే. భక్తులగు యాదవేంద్రులఁ బరగఁ జూచి
యన్యపరిభవ మెఱుగ రీ యదువు' లనుచు
వీరిఁబరిమార్ప నేఁ దక్క వేరొకండు
దైవ మిఁక లేదు త్రిభువనాంతరమునందు.”
అని నిశ్చయించుకొని కృష్ణుఁడు యాదవుల కన్యోన్య వై గాను బంధంబులంగల్పించి, వారల హతంబుగావించి భూభారంబడంప నెంచుటచే శాపదగ్ధులైన యాదవుల నుద్ధరింపక యూరకుండెను.

శ్రీ కృష్ణుఁడు
(iii) – సామ్రాజ్యస్థాపనాచార్యుఁడు –

నరులలో జన్మించిన నహుషుఁడు నూరు యజ్ఞములు చేసి దేవసముఁడై తుదకు దేవేంద్రపదవిఁగూడ కొంత కాల మనుభవించెను. ఆతని వంశమందు పుట్టిన యయాతిమహా రాజు మహావైభముతో భూమండలంబేలి ఆనాఁటి యసుర వీరులనుగూడ నదిమియుంచెను. ఈతఁడు తన యఖండసామ్రా జ్యమున నలుదిక్కుల కన్న సుతులనే కావలి యుంచియుండెను. కాని కొన్ని కారణములచే పెద్దవాఁడగు యదువునకు సార్వ భౌమత్వవియక కనిష్టుండగు పురు వనువాని కయ్యటయొసం గెను. యదు తన పుత్రమిత్రానుచర గణంబుతోఁ బాశ్చాత్య భాగంబులకు వలసపోయి అచ్చో తన స్వతంత్రతఁ గాపాడుకొని యుండెను. కొంత కాలమైన తరువాత నీతని వంశీయులైన హైహయులు భారతవర్షమున కేతెంచి ఆర్యావర్త పుణ్య భూమి కంటియున్న నర్మదానదీతీరంబున నొక్కపురంబు నిర్మిం చుకొని యందుండి యభివృద్ధిఁగాంచుచుండిరి. కార్తవీర్యుని బాహుబల సంపత్తులదే యదువంశీయులు దక్షిణాపథమును ఏకఛత్రాధిపత్యముగ నేలఁ దొడఁగిరి. సిరిసంపత్తు లధిక మైన తరువాత పతిత క్షత్రియులే పావనులై తమయింటి పడుచుల వైదిక శిష్టాచార పారీణులగు బ్రాహ్మణోత్తము”కుఁగూడ నియ్య మొదలిడిరి. కొంత కాలమైనతరువాత నధికారమదాంధత హైహయులచే ననేక దుష్ట కార్యము లాచరింపఁజేసెను. తపో నిష్ఠాగరిష్ఠులగు బ్రాహ్మణోత్తములఁ దృణీకరించుటచే, వా రలిగి హైహయరాజ్యమేగాక ఆర్యావర్తమందలి సనాతన రాజ్యములంగూడ కూకటి వేళ్ళతో విధ్వంస మొనర్చిరి,
కం!! "భూపాలకులకు విపులం
గోపింప జేయఁ దగదు కోపించినఁ ద
త్కోపానలంబు మొదలికి భూపాలాటవులఁ గాల్చు భూకంపముగాన్”॥
కార్తవీర్యుని అనంతరము యదువంశీయులు కొంత కాల మార్యావర్తమున నామమాత్రావశిష్టులై యుండిరి. మాధవుఁడు ఉత్తరాపథమందును, ముచికుందాదులు దక్షిణా పథమునను, జిన్న చిన్న రాజ్యముల నెలకొల్పుకొని మనుచుం డిరి. వసుదేవుని నాఁటికి యాదవుల పలుకుబడి మజల నార్యా వర్తమున సధికము కాఁదొడంగెను. కాని కంసుని దుండగము లచే యాదవులయం దెకమత్య మంతరింప వారందఱు నానా దేశంబుల కేగిరి, ముచికుందునినిద్రాస క్తియు, కుండిన నగరంబు నందుండిన భీష్మకుని వైరాగ్యమును, కంసుని క్రౌర్యమును, యాదవుల నెల్లెడల నిరుత్సాహలఁజేసెను. తనయాదవులదుస్ధితిఁ గాంచి శ్రీకృష్ణుఁడు ముందంజ వేసి కంసుంగడ దేర్చి, ముచికుం దుని మేల్కొల్పి, భీష్మకుని పుత్రికను పరిణయమై యాదవుల యందైకమత్యము నెలకొల్పెను.
కంసవధానంతరము శ్రీకృష్ణుఁడు జరాసంధునితో నిరం తరయుద్ధనిమగ్నుడయ్యెను. అరక్షితంబగు మధురానగరంబు యాదవుల సంరక్షణమున కనువుకాకుండెను, అందుచే శ్రీకృ ష్ణుఁడు యాదవ రాజధాని నింకొక నూతన నగరంబునకు మార్చవలసివచ్చెను. ఈతనియను చరులందు అభీరులెక్కుడుగ నుండుట చేతను, వారికి నీటిపై నెక్కుడు బలముండుటంబట్టి యు శ్రీకృష్ణుఁడు తన నూతన నగరము నీటఁగట్టెను, మహోదధీ రంబుల నదీమియుచుటకు మహేంద్రంబు ప్రాచీభాగంబున నెట్టులుండెనో, పశ్చ మోదధీ తీరంబుల నెల్ల నేలుటకు రైవత కాద్రియు పశ్చమ తీరంబున నట్టులుండెను. అందు చేత నే శ్రీకృష్ణుండు తత్పర్వతప్రాంతమందుండిన ద్వీపంబుపై ద్వారకా నగరంబునిర్మించి యాదవుల నిర్వక్రపరాక్రమోపేతులఁ జే సెను. మున్ను కార్తవీర్యుఁడుండిన మాహిష్మతీ నగరంబుకూడ నా పరిసdంబులనే వర్ధిలి యుండెను. ఆర్యులు నాటుదారులఁ (land routes) బట్టి నలుగ డల వ్యాపింపఁ జూచునప్పుడు హస్తినా నగరము, మధుర, గిరివ్రజము వంటి భూమధ్యనగరములు రాజధానులుగ నుండు టకువీలయ్యెను. కాని పణులపర్యటనలచే నేఁడార్యులఅధి కారము సముద్రాంతర భూములకుఁగూడ నీటిమార్గము ఁబట్టి వ్యాపింపఁ జొచ్చెను- శ్రీకృష్ణుని నాఁటికి ఆర్యుల స్థానము భారవాహ జలసంధి (Bherring Straits). మెరుదల (Britain) వఱకున్న స్థలజల భాగంబుల వావరించి యుండెను- ఆ ప్రపంచమునకు ద్వారకయే అన్నిట ననువైన కేంద్ర స్థానము. ఇటనుండిన వీరు లానాఁటిప్రపంచమందలి నాటు, నీటి మార్గములనెల్ల నేకరీతి స్వాధీనమందుంచుకొనఁ జాలియుందురని ఎఱంగియే శ్రీకృష్ణుండద్దానిని యాదవులకు రాజధానిగ నెన్ను కొనెను. మనుజులకుఁ డెలిసిన ప్రపంచపరిమితి అధిశమైనకొలఁది ప్రపంచముయొక్క కేంద్రస్థానముకూడ మారుచుండును, రామునినాఁడు అయోధ్య కేంద్రముగనుండెను. శ్రీకృష్ణుని నాఁడు ద్వారక కేంద్రస్థానము కావలసివచ్చెను - కొంత కాలము తరువాత ఈగుప్త (Egypt) ఆనాఁటి ప్రపంచమునకు కేంద్ర స్థానమయ్యెను. కొలంబస్ (Colombus) పర్యటనల చే నేఁడు బ్రిటిష్ దీవులు ప్రపంచమునకు కేంద్రముగనున్నవి. అమెరికా ఖండ మభివృద్ధిఁ జెందుచున్నదిగావున కొలదికాలములో జపాన్ దీవులో హ్యండురాస్ (Honduros) దీవులో కేంద్రస్థానము లగును. నైల్నదీ ముఖద్వారమందు అలగ్జాండర్ నిర్మించిన మహానగరము (Alexandria) ప్రాపంచకవర్తకమునకు కేంద్ర స్థానమై విఖ్యాతిఁ గాంచుటెల్ల ఆవీరాధివీరు బుద్ధివిభవమును వెల్లడించునట్లు, ద్వారశా నగర మభివృద్ధిఁగాంచి, అభిరు లన్ని యెడల విజృంభించుట కనువొసంగుట యెల్ల శ్రీకృష్ణుని సామ్రాజ్య నిర్మాణ కౌశలంబును వ్యక్తీకరించును. ఉత్తర దక్షి ణాపథంబులఁ జెదరియున్న యాదవుల నవసరపడినప్పుడెల్ల ఆ నూతన నగరము నొక్కచోఁ జేర్చుటకు ద్వారక యెంతయో యనుకూలముగ నుండెను; అందుచే నాఁటినుండి యాదవు లపజయంబన్న నెట్టిదో యెఱుంగక నచ్చో మనఁ గలిగిరి. నీటఁగట్టఁబడిన ద్వారకానగరము, యాదవుల ఆదరమున నభివృద్ధి చెందిన అభీరుల కనిర్వచనీయమైన సౌకర్యములఁ జేకూర్చి, పశ్చమోదధియంతయు వారి సొత్తోనర్చెను, కావు ననే నాఁటినుండి నా సంద్రమును, ఆర్యు లాభీర సముద్ర మని పిలువఁ జొచ్చిరి. పాశ్చాత్య దేశంబులఁక్కు మొగంబయి యుండిన ఆనూతన నగర మచ్చటి సంపత్తులనెల్ల నార్యావరమునకుఁ గొనివచ్చు టకుఁ దగిన ద్వారముగ నుండుట చేతనే కావలయు నద్దానికి ద్వారకా యనునామంబు సార్థకంబయ్యెను. నేఁటికిని పాశ్చాత్య దేశంబులతో ప్రధానముగ వర్తక మొనర్చుచున్న పట్టణ w (Karachi, Broach, Surat, Diu, Bombay) ష్ణుని ద్వారక పరిసరంబులనే యుండుటఁజూడ ఆ మహాపురుషుని ప్రజ్ఞాదికములపట్ల మనకింకను గౌరవ మధికము కాఁగలదు. శ్రీకృష్ణుఁడెంత ప్రయత్నించినను యాదవులు తమ్మావ రించియున్న దుర్గుణంబుల వీడకుండుటచే నాతనికి వారిపట్ల శంక లుత్పన్నమయ్యేను-శమంతకమణి కాన్పింపనప్పుడు, సుభద్ర నర్జునునకిచ్చు నవసరమున, శశిరేఖా వివాహ సందర్భమునను, మదిరపానామత్తులై యాదవులు ప్రభాత తీర్థమందు స్త్రీలతో విచ్చలవిడి విహరించుపట్టునను, బలరాముఁడు రుక్మితోఁ జూద మాడిస్వల్ప కారణమునఁగుపితుఁడై, ఒక్క వేటుననాతనిఁజంపు తఱిని, యాదవులపట్ల శ్రీకృష్ణుఁడు నిరుత్సాహుడయ్యెను. కావుననే నాఁటినుండియు నాతఁడు పాండవుల నార్యావర్తసార్వ భౌములుగఁజేయ నెక్కుడుగ యత్నింపవలసి వచ్చెను. ఉగ్రసేను ననంతరము, యాదవసామ్రాజ్యమునకు, సర్వసద్గుణ సంపన్నుఁడైనను ఆహవముల యందంతగ ననుభవములేని యక్రూరుని బట్టభద్రునిగనొనర్చుటయందే శ్రీకృష్ణుఁడు యాద వులసామ్రాజ్యాభివృద్ధి సంతతో నా పెనని నిశ్చయముగ నెఱుంగ నగును. పాండవులకు రావలసిన రాజ్యభాగ మిప్పించి వార అన్న వస్త్రములకు దూరులుకాకుండ ముస్ను చూచుచుండిన శ్రీకృష్ణుఁడు, అటుతరువాత పాండవదూతగను, పార్థసారథిగను కూడ నుండుట కంగీకరించుటయెల్ల, తనకు నచ్చినవారు సార్వభౌమ పీఠంబున నుండుట కిచ్చగించి యేకదా. యాదవుల దుష్కృత్యంబులచే, శ్రీకృష్ణుని యాదవసామ్రాజ్యప్రతిష్ఠాప నము పొసఁగకున్నను ఆతఁడు పాండవులఁబట్టి, వారలనుద్ధరించి అఖిలభారత సామ్రాజ్యస్థాపన కార్యము నెఱవేర్చుకోనెను. వరుణదేవుఁ డేలుచుండిన సామ్రాజ్యము (Sea Empire) నకు అక్రూరుని బట్టముగట్టి, పాకశాసనుని పాలనంబందండిన స్వారాజ్యమును (Land Power) పాండవేయులకందఁ జేసెను. జగత్కల్యాణమునకు కావలసినది పాలకుని సద్వర్తన మేగాని పుట్టు పూర్వోత్తరంబులు గావని శ్రీకృష్ణుఁడు సృష్టీకరిం చెను. ఆధునికకవి యొక్క డా మహాత్ముఁ జొనర్చిన సంస్కర ణముల ని అభివర్ణించి యున్నాఁడు.
సీకి మూలఁబట్టించెగా పూజలు మాన్పించి
నిరుపయోగులబంద విల్హగులను;
మించి బోధించెగా మేదినీ సురలను

గోసంతుల భక్తి గొల్వు వెనుచు; మాన్పించి నాఁడ్రుగా మహిమలేదని జెప్పి
రహి క్షుద్ర దేశతారాధనముల; సనియఁజే సెనుగగా (జన్మతోడనే రాజు'
ననియెడు నాచారమును గడంగె;
పుట్టువనుగల్లు సత్వమ్ముగట్టి పగు,
బుదియింతయేనియున్ బొనరకున్న;
ననుచు నూహించి జేనకీతన యుఁ డనని
పాండుతనయుల కొనఁగూర్చెఁ బ్రాభనమున ||

శ్రీ కృష్ణుఁడు (iv) మ త స్థాప కుఁడు .

తమచుట్టునుండిన ప్రజలదుస్థితిని జూచి సహింపలేక యుదారస్వభావులగు మహాపురుషులు వారి నుద్ధరించుటకు ప్రయత్నింతురు. వరుల బాధలు తమవిగభావించి సంఘసంస్క రణకుఁ బూనుకొందురు. ఈసంఘసంస్కర్తలే కాలక్రమమున తమజాతికి నాయకు లగుదురు (Tribal heroes ). వీరు తమ జాత్యభివృద్ధికి అవలంబించిన మార్గముల నితరజాతి ప్రజలు కూడ నామోదించినంతనే వీరు మానవసంఘముచే మహాత్ము లుగను, అవతారపురుషులుగను ఎన్న బతుదురు. జూదుల (యూదుల-Jews) దుస్థితిచూచి సహింపలేక వారల నుద్ధరింప నెత్నించి ఏసుక్రీస్తు మహాత్ముఁ డయ్యెను. రోమకుల పాలన మున సకల సద్గుణములఁ గోల్పోయి పశుప్రాయులుగఁ బ్రవ ర్తించుచున్న యూదులకు స్వర్గ రాజ్య రాజమార్గముఁ జూపిన మహాపురుషుఁడే, నేఁడు మానవకోటిచే నీశ్వరపుత్రుఁడుగనారా ధింపబడుచున్నాఁడు. మహమ్మదు పుట్టిననాఁడు అరేబియా స్థితికూడ మిగుల నిర్భాగ్యదశయం దుండెను. ప్రజలలో నైకమత్యము లేకుండెను. శాఖ కొక దేవుఁడు, గ్రామమున కొక దేవత, వీధికొక దేవాలయము, ఇంటి కొక ఈశ్వరుఁ డగు టచే నెవరికివారే తాఁబట్టిన కుందేటికి మూడేకాళ్ళను చుండిరి. అంతఃకలహములచే నరబ్బులు నిరంతరదారిద్య్ర్యమును, దాస్య మును అనుభవించుచుండిరి. మహమ్మదు తన వారినుద్ధరింప నెంచి యెంత యో కాల మాలోచించి యాకారశూన్యమైన ఏ కేశ్వ రోపాసనము బోధింపఁ జొచ్చెను. ఆకాలమున నరేబియా దేశ మందున్న వివిధ మతములను, వివిధ దేవతలను ఖండించి అందఱి కనువగు నొకమతమును నెలకొలిపెను. అన్ని దేవళములను విధ్వంస మొనర్చి మక్కాపట్టణమం దాదినుండియు న నేకుల చే నారాధింపబడుచుండిన 'కాబా' యను ఈశ్వర దేవళము నొక్కదానినే మిగిల్చెను. చాలాకాల మాతఁడు తనజాతి వారు పెట్టిన బాధల ననుభవించెను. కాని తుదకు జయముఁ గాంచెను. ఆయరబ్బులనాయకుఁడు నేఁడు లోకులచే నిజమైన దేవదూత (The only true Prophet) అని కొనియాడఁ బడుచున్నాఁడు. శ్రీకృష్ణుఁ డవతరించుటకుఁబూర్వము హిందూసంఘము కూడ మిక్కిలి దుస్థితియం దుండెను.
కం॥ "జననము నైశ్వర్యంబును,
ధనమును విద్యయును గల మద్ఛన్నుల కిం
చనగోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగలేరు నిఖిల విభున్తుత్యా”. కంసునివంటి బాలఘాతుకులును, నరకునివంటి నారీజన మానాసహారులును, జరాసంధునివంటి భైరవార్చకులును ఇంద్రియానందమే జన్మకుపరమావధి యనిభావించి, మానన సంఘమునకు మహాపదలఁ జేకూర్చుచున్న ఆసురవృత్తులు భారతవర్షమం దంతటను చెలరేగియుండిరి. జైమిని చేబోధింపఁ బడిన కర్మప్రధానమగు పూర్వమీమాంసమతము మూలఁబట్టి యుండెను. అట్టిసమయమున శ్రీకృష్ణుఁడు (జ్ఞానప్రధానమైన భక్తిమార్గమవలంబించిన ముక్తిఁబడయుదు' రని బోధించెను, నాఁటినుండియు నార్యావర్త మనస్యసామాన్యమైన దివ్యకళ లతో వెలుగొంది, అఖిల దేశంబులకు నాదర్శప్రాయమయ్యెను. ఆనాఁడు సర్వభద్రసంయోజకుఁడైన శ్రీకృష్ణుఁ డొనర్చిన సంస్కరణములే, ఈనాఁటికిని ఆర్షమతమును, హిందూసంఘ మునుకూడ నశింపకుండ కాపాడుచున్నవి. అందుచేత నే మన వారు కొందఱతని ‘శ్రీకృష్ణభగవానుఁ', డనుచున్నారు. శ్రీకృష్ణుని ధైర్యసాహసములు, సమయస్ఫూర్తి, విశాలవీక్షణము, కార్యదీక్ష, దేశభక్తి, సర్వసమత్వము చక్కగ గుర్తెఱింగిన, నీతఁడు మహాపురుషుఁడేగాక మహాత్ముఁ డనికూడ స్పష్టపడును. శ్రీకృష్ణుని ఆదర్శజీవనమును మహర్షి పోతన:
శా!! "శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగారరత్నాకరా
లోకద్రోహీన రేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తిహరణా నిర్వాణసంధాయ కా
అని చక్కగ కుంతిచే సనిపించెను.
అని శ్రీకృష్ణుని స్తుతించుచు, నీతని యుత్సాహమునే యెక్కుడుగఁ గొనియాడెను.
కావున నర్జునుఁడు తలంచినట్లు మనముకూడ శ్రీకృష్ణుని:—— “మన సారథి మనసచివుఁడు
మనవియ్యము మనసఖుండు మనిబాంధవుఁడున్
మనవిభుఁడు గురుఁడు దేవర


శ్రీ కృష్ణుడు -యాదవుల పూర్వవృత్తాంతము

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.